News March 17, 2024
వనపర్తి: విద్యుదాఘాతంతో ఒకరి మృతి

వనపర్తి మండలంలోని పెద్దగూడెం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన ఖలీల్ ట్రాన్స్ఫార్మర్ వద్ద వ్యవసాయ బోరుకు సంబంధించిన విద్యుత్తు కనెక్షన్ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో అతను అక్కడికక్కడ మృతి చెందాడు. ఈఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 28, 2026
నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ

మహబూబ్‌నగర్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా జిల్లాలోని మున్సిపాలిటీలలో నామినేషన్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకి తెలిపారు. మహబూబ్‌నగర్, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీలకు సంబంధించి బుధవారం నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుందన్నారు. నామినేషన్ దాఖలు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
News January 27, 2026
మోగిన నగారా.. MBNRలో 1,97,841 ఓట్లు

మున్సిపల్ కార్పొరేషన్ <<18974641>>ఎన్నికలకు నోటిఫికేషన్<<>> విడుదలైంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లలో 1,97,841 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 96184 మంది ఉండగా మహిళా ఓటర్లు కూడా ఇంచుమించుగా అదే సంఖ్యలో ఉన్నారు. ఈ కార్పొరేషన్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కావడం తెలిసిందే. ఇక ఫిబ్రవరి 11న ఎన్నికలు, 13న ఫలితాలు వెలువడనున్నాయి.
News January 27, 2026
పాలమూరు: పేపర్లలో తప్పులుంటే అధికారులకు తెలపాలి: VC

పాలమూరు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న మూడో సెమిస్టర్ పరీక్షా కేంద్రాలను మంగళవారం ఉపకులపతి (VC) శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశ్నపత్రాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


