News June 16, 2024

త్వరలో వందేభారత్ స్లీపర్ ట్రయల్ రన్

image

వందేభారత్ స్లీపర్ రైళ్లను తీసుకొచ్చే ప్రక్రియను రైల్వే వేగవంతం చేసింది. ఈ ఏడాది ఆగస్టుకల్లా ఈ రైళ్ల ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు వందేభారత్‌లో సీటర్లు మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే. స్లీపర్ బెర్తులతో కూడిన రైళ్లు అందుబాటులోకి వస్తే దూర ప్రయాణాలు చేసేవారు పడుకునేందుకు వీలు కలగనుంది. వీటిలో సేవలు మరింత అత్యున్నతంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

Similar News

News January 16, 2025

BUDGET 2026: రైల్వేస్‌కు 20% నిధుల పెంపు!

image

బడ్జెట్లో రైల్వేస్‌కు 20% ఎక్కువ నిధులు కేటాయిస్తారని సమాచారం. FY25లో కేటాయించిన రూ.2.65లక్షల కోట్ల నుంచి రూ.3లక్షల కోట్లకు పెంచుతారని తెలుస్తోంది. ప్రస్తుత CAPEXలో ఇప్పటికే 80-90% మేర ఖర్చుపెట్టేశారు. FY26లో మరిన్ని రైల్వే స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయడం, కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం, రైల్వే ట్రాకుల డీకంజెషన్ వంటి పనులు చేపట్టనున్నారు. అందుకే నిధులు పెంచుతారని విశ్లేషకులు అంటున్నారు.

News January 16, 2025

సైఫ్‌కు తప్పిన ప్రాణాపాయం.. ముగిసిన సర్జరీలు

image

యాక్టర్ సైఫ్ అలీఖాన్‌ కాస్మొటిక్, న్యూరో సర్జరీలు ముగిశాయి. ఆయనకు ప్రాణాపాయం తప్పిందని లీలావతీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నాయి. ఆపరేషన్లు ముగిశాక అతడి భార్య కరీనా కపూర్ సహా కుటుంబ సభ్యులు డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సైఫ్‌ను దుండగుడు 6 సార్లు <<15167259>>కత్తి<<>>తో పొడిచాడు. దాంతో అతడి మెడవద్ద లోతైన గాయం అయింది.

News January 16, 2025

లోన్స్ కోసం పాస్ బుక్ అడగొద్దు: ప్రభుత్వం

image

TG: పంట రుణాల కోసం బ్యాంకుల్లో పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ సమర్పించాల్సిన అవసరం లేదని భూ భారతి చట్టం గెజిట్‌లో ప్రభుత్వం పేర్కొంది. రైతుల నుంచి బ్యాంకర్లు పాస్ పుస్తకాలను అడగొద్దని స్పష్టం చేసింది. వ్యవసాయేతర, అబాదీ భూముల కోసం ప్రత్యేక పోర్టల్‌ను తీసుకురానుంది. పంట లోన్లను రైతులు చెల్లించకపోతే ఆ రుణాల వసూలు కోసం బ్యాంకర్లు ముందుగా జిల్లా కలెక్టర్లను సంప్రదించాల్సి ఉంటుంది.