News September 16, 2024

తెలుగు రాష్ట్రాలకు త్వరలోనే వందే మెట్రో?

image

దేశంలో తొలి వందే భారత్ మెట్రో రైలు(అహ్మదాబాద్-భుజ్)ను ప్రధాని మోదీ నేడు ప్రారంభిస్తారు. త్వరలోనే చెన్నై-తిరుపతి, సికింద్రాబాద్-విజయవాడ మధ్య ఈ రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది. 100 నుంచి 350KM దూరమున్న నగరాల మధ్య 100KM వేగంతో నడిచేలా ఈ AC రైళ్లు రూపొందించారు. రిజర్వేషన్ ఉండదు. నేరుగా టికెట్ తీసుకుని ఎక్కాలి. 16 కోచ్‌ల రైలులో 1150 మంది కూర్చొని, 2058 మంది నిలబడి ప్రయాణించవచ్చు.

Similar News

News October 31, 2025

భారత్ ఆలౌట్.. స్కోర్ ఎంతంటే?

image

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్ శర్మ 37 బంతుల్లో 68 పరుగులతో రాణించారు. 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో అభిషేక్, హర్షిత్ రాణా (35) కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. హేజిల్‌వుడ్ 4 ఓవర్లు వేసి కేవలం 13 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశారు. గిల్ (5), శాంసన్ (2), సూర్య (1), తిలక్ (0), అక్షర్ పటేల్ (7), శివమ్ దూబే (4) ఫెయిల్ అయ్యారు.

News October 31, 2025

భారత్‌లో టెస్లా, స్టార్‌లింక్ నియామకాలు

image

ఎలాన్ మస్క్‌కు చెందిన EV కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’, శాటిలైట్ ఇంటర్నెట్ సేవలందించే ‘స్టార్‌లింక్’ భారత్‌లో ఉద్యోగ నియామకాలు ప్రారంభించాయి. ముంబై, పుణే, ఢిల్లీ కేంద్రంగా పనిచేసేందుకు నిపుణుల కోసం టెస్లా ప్రకటన ఇచ్చింది. ఇందులో సప్లై చైన్, బిజినెస్ సపోర్ట్, AI, HR తదితర విభాగాలున్నాయి. అలాగే ఫైనాన్స్, అకౌంటింగ్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తామని, బెంగళూరులో పనిచేయాలని స్టార్‌లింక్ పేర్కొంది.

News October 31, 2025

సుశాంత్‌ను ఇద్దరు కలిసి చంపారు: సోదరి శ్వేతా సింగ్

image

2020లో జరిగిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణంపై సోదరి శ్వేతా సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, ఇద్దరు కలిసి హత్య చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని US, ముంబైలోని ఇద్దరు సైకిక్స్ వేర్వేరుగా తనకు చెప్పారన్నారు. ‘సుశాంత్ బెడ్, ఫ్యాన్ మధ్య దూరాన్ని బట్టి అతను ఉరేసుకుని చనిపోయే అవకాశమే లేదు. మెడపై దుపట్టా మార్క్ కాకుండా ఒక చిన్న చెయిన్ ముద్ర మాత్రమే కనిపించింది’ అని పేర్కొన్నారు.