News March 20, 2024

పవన్‌కు వంగా గీత కౌంటర్

image

AP: తనను జనసేనలోకి ఆహ్వానించిన పవన్‌కళ్యాణ్‌కు పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత కౌంటర్ ఇచ్చారు. ‘నేను కూడా పవన్‌ను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది? 2009 కంటే ముందు నుంచే నేను రాజకీయాల్లో ఉన్నా. 2009లో చిరంజీవి నాకు అవకాశం ఇచ్చారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు నాకే ఉంది’ అని ఆమె మాట్లాడారు.

Similar News

News January 28, 2026

ముడతలు, మచ్చలు తగ్గించే ఎగ్ ఫేస్ ప్యాక్

image

వయసు పెరిగే కొద్దీ చర్మంపై మచ్చలు ముడతలు వస్తుంటాయి. వీటిని తొలగించడంలో ఎగ్ ఫేస్ ప్యాక్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. ఒక ఎగ్ వైట్, కలబంద గుజ్జు, పంచదార పొడి బాగా కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే సరిపోతుంది. ఇలా తరచూ చేస్తుంటే ముఖం అందంగా మెరిసిపోతుంది.

News January 28, 2026

30 రోజుల లోపు మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు కట్టడికి సూచనలు

image

మొక్కజొన్న విత్తిన వెంటనే ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చి కత్తెర పురుగు ఉనికిని గమనించాలి. మొక్కలపై వాటి గుడ్లను గమనిస్తే వేపమందును పిచికారీ చేయాలి. లేత మొక్కజొన్న పంటల్లో 30 రోజుల వరకు ఎకరాకు 15 పక్షి స్థావరాలను, 15 లింగాకర్షక బుట్టలను పైరులో ఏర్పాటు చేసుకోవాలి. ఎకరాకు 9 కిలోల పొడి ఇసుక, కిలో సున్నాన్ని కలిపి మొక్కజొన్న సుడులలో వేస్తే ఇసుక రాపిడికి కత్తెర పురుగు లార్వాలు చనిపోతాయి.

News January 28, 2026

భారీగా పెరిగిన కొబ్బరి ధరలు

image

AP: కొన్ని నెలలుగా ధరలు లేక ఇబ్బందులు పడుతున్న కొబ్బరి రైతులకు ఊరట కలుగుతోంది. TGలో మేడారం జాతర, వరుస శుభకార్యాల ప్రభావంతో ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. వారం కిందటి వరకు వెయ్యి కాయల ధర రూ.15-16వేలు ఉండగా ఇప్పుడు రూ.19-20 వేలకు చేరింది. ఉభయగోదావరి జిల్లాల నుంచి రోజూ 70 లారీల సరకు ఎగుమతి అవుతోంది. ఇక కురిడీ కొబ్బరిలో పెద్ద రకం రూ.32,500, చిన్నకాయ రూ.29వేల వరకు పలుకుతోంది.