News March 22, 2024
వంగా గీతను గెలిపించి సీఎం వద్దకు వస్తా: దొరబాబు

AP: పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించి తీరుతామని సిట్టింగ్ MLA పెండెం దొరబాబు ధీమా వ్యక్తం చేశారు. YCP అభ్యర్థి వంగా గీతను గెలిపించుకొని సీఎం జగన్ వద్దకు వస్తానని తెలిపారు. సీఎంతో సమావేశం తర్వాత ఆయన మాట్లాడుతూ.. ‘పొత్తులతో టీడీపీ-బీజేపీ-జనసేన ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో జగన్ బొమ్మను చెరపడం ఎవరికీ సాధ్యం కాదు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలూ వైసీపీనే గెలుచుకుంటుంది’ అని తేల్చిచెప్పారు.
Similar News
News April 8, 2026
డైలీ ఒక్క స్పూన్.. మీ హెల్త్ సేఫ్

*హలీం సీడ్స్: 100g రూ.20-30 లోపే. ఇందులోని ఐరన్‌తో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. నీటిలో నానబెట్టి తినొచ్చు.
*గుమ్మడి గింజలు: అరకిలో రూ.120-150కి. ఫైబర్, మెగ్నీషియం, జింక్, హెల్తీ ఫ్యాట్ కండరాలను బలోపేతం చేస్తాయి. నేరుగా తినొచ్చు.
*ఫ్లాక్స్ సీడ్స్: 100g రూ.30-50లోపే. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి సహకరిస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్, హార్మోన్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. పొడిచేసి తీసుకోవాలి.
News April 8, 2026
ఖబడ్దార్.. కేటీఆర్, హరీశ్‌కు పొంగులేటి వార్నింగ్

TG: KTR, హరీశ్ రావుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘మీ అవినీతి చిట్టా అంతా ప్రభుత్వం దగ్గర ఉంది. త్వరలో అన్నీ బయటకు వస్తాయి. మీ తాటాకు చప్పుళ్లకు భయపడం.. ఖబడ్దార్’ అని సెక్రటేరియట్‌లో ప్రెస్‌మీట్‌లో హెచ్చరించారు. ఇక నాదర్‌గుల్ భూముల్లో వాటా దక్కకపోవడం వల్లే హరీశ్ తనపై <<19499785>>ఆరోపణలు<<>> చేస్తున్నారని మండిపడ్డారు. వట్టినాగులపల్లి భూములతో తన కొడుకుకి ఎలాంటి సంబంధం లేదన్నారు.
News April 8, 2026
గ్రీస్‌లో 15ఏళ్లలోపు పిల్లలకు SM నిషేధం!

గ్రీస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2027 జనవరి 1 నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధిస్తున్నట్లు ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ ప్రకటించారు. నిద్రలేమి, మానసిక ఒత్తిడి, SMకి వ్యసనపరులుగా మారుతున్న చిన్నారులను రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పేరెంట్స్ అనుమతి ఉన్నా 15 ఏళ్లలోపు వారికి SM బ్యాన్ ఉంటుందన్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌లోనూ SMను బ్యాన్ చేశారు.


