News August 16, 2024
వరాలిచ్చే కల్పవల్లి వరలక్ష్మి!
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేస్తారు. ఈ వ్రతాన్ని నియమ నిష్ఠలు, భక్తి, ఏకాగ్రతతో జరుపుకోవాలి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరిస్తారు. వరలక్ష్మీ వ్రతం చేయడం మహిళలకు అత్యంత శుభప్రదం. ఈరోజు వీలుకాకపోతే ఏ శుక్రవారమైనా వ్రతం చేసుకోవచ్చు. ఈ వ్రతం ఆచరించడం వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షాలు ఉంటాయని, పాపాలు తొలగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుందని నమ్మకం.
Similar News
News January 22, 2025
USA ఊహించినంత ప్రయోజనం ఉండదు: రఘురామ్ రాజన్
దిగుమతి సుంకాలు పెంచాలనే USA అధ్యక్షుడు ట్రంప్ ఆలోచన ప్రపంచ ఆర్థిక అసమానతలకు కారణమవుతుందని RBI మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. విదేశాల్లో వస్తువులు చౌకగా ఉన్నందున వాటిని దిగుమతి చేసుకునేటప్పుడు సుంకాలు పెంచి ప్రయోజనాలను పొందాలని USA చూస్తున్నట్లు తెలిపారు. దీంతో విదేశీ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. సుంకాలపై అమెరికా ఊహించినంత ప్రయోజనకరంగా ఉండదన్నారు.
News January 22, 2025
రంజీ జెర్సీలో మెరిసిన హిట్ మ్యాన్
ముంబై తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడేందుకు రోహిత్ సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నెల 23 నుంచి జమ్మూకశ్మీర్‌తో జరగనున్న రంజీ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్న హిట్‌మ్యాన్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోహిత్ రంజీ జెర్సీలో మెరిశారు. కొత్త జెర్సీలో ఫేవరెట్ క్రికెటర్‌ను చూసిన ఫ్యాన్స్ రంజీల్లోనూ అదరగొట్టాలని పోస్టులు పెడుతున్నారు. ముంబై జట్టుకు రహానే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
News January 22, 2025
ధనవంతులు అవ్వాలంటే.. ఇవి తప్పనిసరి!
జాబ్ అయినా చిన్న వ్యాపారం అయినా పొదుపు, పెట్టుబడుల కోసం పక్కనబెట్టాకే ఖర్చులకు వాడితే బెటర్. అలాగే, మంచిరోజు కోసమో అప్పుడే ఎందుకు? అనుకోకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడే ఆ పని ప్రారంభించాలి. ఇతరులతో పోల్చుకొని హంగులు, ఆర్భాటాలకు పోకుండా తక్కువలోనే జీవిస్తే అధిక మొత్తం పోగేసేందుకు వీలుంటుంది. ఎప్పటికప్పుడు నిపుణులతో మాట్లాడుతూ పన్నుల నుంచి మినహాయింపు పొందేలా ప్లాన్ చేసుకోవాలి.