News August 26, 2024

వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్ మరోసారి అరెస్ట్

image

TG: డ్రగ్స్‌ కేసులో జైలుకు వెళ్లి బయటకు వచ్చిన వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్ ప్రభాకర్ రెడ్డి మరోసారి అరెస్టయ్యారు. మహిళను పెళ్లి చేసుకుంటానని మోసగించిన కేసులో గచ్చిబౌలి పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఏపీకి చెందిన మహిళతో పరిచయం ఏర్పడగా కొంత కాలం కలిసి ఉన్నారు. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News January 9, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 9, శుక్రవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.23 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.22 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.58 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.15 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News January 9, 2026

ఈడీ vs ఐప్యాక్: హైకోర్టుకు చేరిన వివాదం!

image

కోల్‌కతాలోని ఐప్యాక్ ఆఫీసులో ED చేసిన <<18797775>>రెయిడ్స్‌<<>>పై రోజంతా హైడ్రామా నడిచింది. మమత వర్సెస్ ఈడీ అన్నట్లు సాగిన ఈ వ్యవహారం చివరికి కలకత్తా హైకోర్టుకు చేరింది. ఈడీ, ఐప్యాక్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. బెంగాల్ కోల్ మైనింగ్ స్కామ్‌కు సంబంధించి తాము సోదాలు చేశామని, తమను మమత అడ్డుకున్నారని ఈడీ తమ పిటిషన్లో పేర్కొంది. ఈడీ రెయిడ్స్‌ను ఆపేలా ఆదేశించాలని ఐప్యాక్ అభ్యర్థించింది.

News January 9, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.