News August 8, 2025
వరలక్ష్మీ వ్రతం.. సాయంత్రం ఈ తప్పు చేయకండి!

వరలక్ష్మీ వ్రతం రోజు(శుక్రవారం) అమ్మవారికి ఉద్వాసన పలకకూడదని పండితులు చెబుతున్నారు. ‘వ్రతం రోజు భూశయనం చేస్తే మంచిది. కచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. చేతికి కట్టుకున్న తోరమును రాత్రంతా ఉంచుకోవాలి. శనివారం తెల్లవారుజామున స్నానానికి ముందు తోరము తీసేయాలి. అమ్మవారిని పంచోపచార విధానంలో పూజించాలి. ఏదైనా పండు నైవేద్యంగా పెట్టి హారతివ్వాలి. దుర్ముహూర్తం వెళ్లాకే అమ్మవారిని కదపాలి’ అని సూచిస్తున్నారు.
Similar News
News August 8, 2025
టీమ్ ఇండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గాయం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే నెలలో జరగబోయే ఆసియా కప్‌లో ఆయన ఆడతారని సమాచారం. ప్రస్తుతం ఆయన బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో SMలో చక్కర్లు కొడుతోంది. కాగా సూర్యకు జర్మనీలో గత జూన్‌లో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన NCAలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. గాయం నుంచి కోలుకుని బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
News August 8, 2025
US ఆయుధాల కొనుగోళ్లు నిలిపివేత.. క్లారిటీ

అమెరికా నుంచి భారత్ ఆయుధాల కొనుగోళ్లు నిలిపివేసిందన్న వార్తలను రక్షణ శాఖ ఖండించింది. ఆ వార్తలు అవాస్తవమని, అవి కేవలం కల్పితమంటూ కొట్టిపారేసింది. వివిధ కొనుగోళ్లు ప్రస్తుతం ఉన్న విధానాల ప్రకారం ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేసింది. భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించిన నేపథ్యంలో కొనుగోళ్లు నిలిపివేశారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
News August 8, 2025
ఐదుగురు BRS ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: రామ్‌చందర్ రావు

TG: బీఆర్ఎస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ BJP స్టేట్ చీఫ్ రామ్‌చందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వారెవరో, ఎప్పుడు చేరతారో త్వరలో చెబుతానన్నారు. వీళ్లే కాకుండా మరింత మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. అటు ఇప్పటికే బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈనెల 10న కాషాయ కండువా కప్పుకుంటారని రామ్‌చందర్ వెల్లడించారు.