News May 26, 2024
వారణాసిలో పెద్దగా ప్రచారం అవసరం లేదు: జైశంకర్

వారణాసిలో బీజేపీ పెద్దగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ అభిప్రాయపడ్డారు. వారణాసిలో మరోసారి మోదీ గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచే పోటీ చేసిన మోదీ జయకేతనం ఎగురవేశారు. మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికపై భారత స్థాయిని చూసి ప్రజలు గర్విస్తున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా చివరి విడత ఎన్నికల్లో భాగంగా జూన్ 1న వారణాసిలో పోలింగ్ జరగనుంది.
Similar News
News November 20, 2025
ఫస్ట్ వింగ్‌కమాండర్ డా.విజయలక్ష్మి రమణన్

భారత వైమానిక దళ మొదటి వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రమణన్. 1924లో జన్మించిన ఆమె మద్రాస్ మెడికల్ కాలేజీలో చదువుకుని చెన్నైలోని ఎగ్మోర్ ఆసుపత్రిలో సేవలందించారు. 1955లో ఆర్మీ మెడికల్ కార్ప్స్లో చేరి గైనకాలజిస్ట్‌గా, తొలి మహిళా అధికారిణిగా నియమితులయ్యారు. 1962, 1966, 1971 యుద్ధాల్లో గాయపడిన సైనికులకు ఆమె చికిత్స అందించారు. 1977లో విశిష్ట సేవా అవార్డును అందుకున్న ఆమె 1979లో పదవీ విరమణ చేశారు.
News November 20, 2025
బాత్రూమ్, వాష్‌రూమ్, రెస్ట్రూమ్.. అసలు తేడా ఏంటి?

బాత్రూమ్, వాష్‌రూమ్, రెస్ట్రూమ్ పదాలకు వేర్వేరు అర్థాలతో పాటు వీటి వినియోగం కూడా భిన్నంగా ఉంటుంది. బాత్రూమ్ అనేది ఇంటిలో ఉండే వ్యక్తిగత గది. ఇందులో టాయిలెట్‌తో పాటు షవర్ లేదా బాత్‌టబ్ ఉంటుంది. వాష్‌రూమ్‌లో స్నానం చేసేందుకు సౌకర్యం లేకపోయినా టాయిలెట్, సింక్ ఉంటాయి. ఇవి ఆఫీసులు, మాల్స్ వంటి పబ్లిక్ ప్రదేశాల్లో ఉంటాయి. రెస్ట్రూమ్ మరింత ఫార్మల్గా, చిన్న విరామానికి అనుకూలంగా ఉంటుంది.
News November 20, 2025
పత్తిని గులాబీ రంగు పురుగు ఆశించకుండా ముందస్తు జాగ్రత్తలు

పత్తిని వేసవి పంటగా డిసెంబర్ తర్వాత సాగు చేయకూడదు. పంట మార్పిడి పద్ధతిని తప్పక పాటించాలి. లింగాకర్షక బుట్టలను పెట్టి పురుగు ఉద్ధృతిని గమనిస్తుండాలి. ఎండాకాలంలో లోతు దుక్కులు చేస్తే గులాబీ పురుగు కోశస్థ దశలను నాశనం చేయవచ్చు. తక్కువ పంట కాలం రకాలను ఎంచుకొని సకాలంలో విత్తుకోవాలి. పొలం చుట్టూ B.T విత్తనాలతో సహా ఇచ్చిన నాన్ B.T విత్తనాలు విత్తుకోవాలి. ఈ పురుగు ఆశించిన పంట విత్తనాలను నిల్వ చేయకూడదు.


