News October 30, 2024

మందుబాబులకు వెరైటీ ఆఫర్.. ఎక్కడంటే!

image

AP: సాధారణంగా వైన్స్ షాపులు మందుబాబులతో కిటకిటలాడుతుంటాయి. కానీ అన్నమయ్య జిల్లా రాజంపేటలో మాత్రం పరిస్థితి రివర్స్‌గా ఉంది. దీంతో కస్టమర్లను తమ షాపులకు రప్పించుకునేందుకు పలువురు యజమానులు ఆఫర్లు ప్రకటించేస్తున్నారు. ప్రతి మద్యం బాటిల్‌కు గుడ్డు, గ్లాస్, వాటర్ ప్యాకెట్ ఫ్రీ అంటూ మందుబాబుల్ని ఊరిస్తూ బోర్డులు పెడుతున్నారు. షాపులు ఎక్కువగా ఉండటం పోటీ పెరగడంతో వ్యాపారులకు ఆఫర్ మార్కెటింగ్ తప్పడం లేదు.

Similar News

News November 20, 2025

పెరిగిన చలి.. కోళ్ల సంరక్షణలో జాగ్రత్తలు(2/2)

image

కోళ్లకు తాజా నీరు, దాణా మాత్రమే అందించాలి. కోళ్ల దాణా బస్తాలను నేలపై కాకుండా చెక్క పలకల మీద ఉంచాలి. దాణా బస్తాలను గోడలకు తగలకుండా చూడాలి. తేమ ఉన్న దాణా నిల్వ చేయకూడదు. బాగా ఎండిన దాణాను మాత్రమే నిల్వ ఉంచాలి. వెటర్నరీ నిపుణుల సూచనల మేరకే తగిన మోతాదులో ఆక్సిటెట్రాసైక్లిన్‌, సల్ఫాడిమిడిన్ వంటి యాంటీ బయాటిక్స్‌, ఇతర శానిటైజర్లు, విటమిన్‌లు, దాణా నీరు ఇవ్వాలి. కోళ్లకు అవసరమైన టీకాలు వేయించాలి.

News November 20, 2025

రెండో సారి తల్లి కాబోతున్న హీరోయిన్

image

బాలీవుడ్ హీరోయిన్, ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ రెండో సారి తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేశారు. బేబీ బంప్‌తో పింక్ కలర్ డ్రెస్‌లో ఫొటోలకు పోజులిచ్చారు. 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ 2022లో కుమారుడికి జన్మనిచ్చారు. అతడికి ‘వాయు’ అని నామకరణం చేశారు. సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూతురే సోనమ్.

News November 20, 2025

రేవంత్ దుర్మార్గాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటాం: హరీశ్ రావు

image

TG: ఫార్ములా ఈ-కార్ రేసును పూర్తి పారదర్శకతతో నిర్వహించామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. KTR ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై స్పందించారు. ‘KTRపై కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ఠ ఇది. ప్రశ్నించే గొంతులను CM రేవంత్ నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. KTRకు BRS అండగా ఉంటుంది. రేవంత్ దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటాం’ అని ట్వీట్ చేశారు.