News March 14, 2025
వర్తు వర్మ.. ‘వారి కర్మ’

AP: పిఠాపురంలో పవన్ గెలుపుపై నాగబాబు చేసిన తాజా <<15761376>>వ్యాఖ్యలు<<>> YCPకి అస్త్రంగా మారాయి. వర్మ సపోర్టు వల్లే తాను అక్కడ గెలిచానని చెప్పిన పవన్ ఇప్పుడు ఆయనకే వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ విమర్శిస్తోంది. తీరం దాటాక తెడ్డు తగలేసినట్లు జనసేనాని వ్యవహారం ఉందని ఆ పార్టీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అప్పట్లో వర్తు వర్మ అని ఇప్పుడు ’వారి కర్మ’ అంటున్నారని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
Similar News
News December 25, 2025
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్

సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘థాయ్ కిళవి’ సినిమా కోసం పూర్తిస్థాయి గ్రామీణ వృద్ధురాలి పాత్రలో ఒదిగిపోయారు. మూవీ టీజర్‌ను రిలీజ్ చేస్తూ ‘ఇంతకుముందెన్నడూ చూడని పాత్రలో’ అంటూ ఆమె పాత్ర గురించి చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న రిలీజ్ కానుంది.
News December 25, 2025
డిసెంబర్ 25: చరిత్రలో ఈ రోజు

✒ 1861: సమరయోధుడు మదన్ మోహన్ మాలవ్యా జననం
✒ 1924: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి(ఫొటోలో) జననం
✒ 1971: డైరెక్టర్ కరుణాకర్ జననం
✒ 1972: భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి మరణం
✒ 1974: ప్రముఖ నటి, రాజకీయ నేత నగ్మా జననం
✒ 1981: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ జననం
✒ సుపరిపాలన దినోత్సవం
News December 25, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


