News October 6, 2024

రీఎంట్రీలో దుమ్మురేపిన వరుణ్ చక్రవర్తి

image

టీమ్ ఇండియా క్రికెటర్ వరుణ్ చక్రవర్తి తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నారు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20లో దాదాపు మూడేళ్ల తర్వాత ఆయన రీఎంట్రీ ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టి బంగ్లా నడ్డి విరిచారు. వరుణ్ ధాటికి ఆ జట్టు మిడిలార్డర్ కుప్పకూలడంతో స్వల్ప స్కోరుకే పరిమితమైంది. కాగా వరుణ్ 2021లో దుబాయ్‌లో స్కాట్లాండ్‌పై చివరి టీ20 ఆడారు.

Similar News

News October 31, 2025

ముక్కలైన దేశాన్ని ఒక్కటి చేసిన ‘సర్దార్’

image

1947లో స్వాతంత్ర్యం నాటికి దేశంలో 565 సంస్థానాలున్నాయి. అప్పుడు రంగంలోకి దిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ HYD, కశ్మీర్, జునాగఢ్ మినహా అన్నీ దేశంలో కలిసిపోయేలా చేశారు. ఆ తర్వాత వాటిపైనా దృష్టి పెట్టారు. కశ్మీర్, జునాగఢ్ సంస్థానాధీశులతో పాటు అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన HYD నిజాం మెడలు వంచారు. ఆపరేషన్ పోలో చేపట్టి హైదరాబాద్ ప్రజలకు విముక్తి కల్పించారు. దేశాన్ని ఒక్కటిగా చేశారు. నేడు ‘సర్దార్’ జయంతి.

News October 31, 2025

నెట్‌వర్క్ ఆస్పత్రులకు వన్ టైం సెటిల్మెంట్!

image

AP: ‘NTR వైద్య సేవ’ కింద నెట్‌వర్క్ ఆస్పత్రులకు వన్‌టైం సెటిల్మెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న ASHA ప్రతినిధులతో భేటీ అయిన అధికారులు 20 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించాలని కోరగా, ఇవాళ నిర్ణయం వెల్లడిస్తామని వారు చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం రూ.250CR రిలీజ్ చేసి, విడతల వారీగా చెల్లిస్తామన్నా సమ్మె విరమించలేదు. దీంతో వన్‌టైం సెటిల్మెంటే మార్గమని భావిస్తున్నట్లు సమాచారం.

News October 31, 2025

నేడు ఈ జిల్లాలకు వర్ష సూచన

image

TG: రాష్ట్రంలో మొంథా తుఫాను ప్రభావం దాదాపుగా ముగిసినట్లేనని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాకపోతే ఇవాళ మాత్రం కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది.