News February 4, 2025
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు వరుణ్ చక్రవర్తి?

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోసం టీమ్ ఇండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని బ్యాకప్‌గా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. నాగ్‌పూర్‌లో జరుగుతున్న టీమ్ ఇండియా ప్రాక్టీస్ సెషన్లో వరుణ్ కనిపించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. దీనిపై త్వరలోనే BCCI నుంచి అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వరుణ్ 14 వికెట్లతో చెలరేగడంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలని డిమాండ్లు వచ్చాయి.
Similar News
News January 25, 2026
‘సభా సార్’తో గ్రామసభ రికార్డుల డిజిటలైజేషన్

TG: రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గ్రామసభల్లో ‘సభా సార్’ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించాలని కేంద్రం కోరింది. దీంతో సమావేశాల్లో చర్చించిన అంశాల ఆడియో/వీడియో రికార్డింగ్స్‌తో ఆటోమేటిక్‌గా సమావేశ మినిట్స్ రూపొందించవచ్చని తెలిపింది. దీని వల్ల శ్రమ తగ్గి, పారదర్శకత పెరుగుతుందని తెలిపింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయాలని కోరింది.
News January 25, 2026
పద్మ అవార్డుల ప్రకటన

వివిధ రంగాల్లో సేవలందించిన 45 మంది వ్యక్తులకు కేంద్రం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. జాబితాలో తెలంగాణకు చెందిన మామిడి రామరెడ్డి(పాడి, పశుసంవర్ధక విభాగం), డాక్టర్ కుమారస్వామి తంగరాజ్(జన్యు సంబంధ పరిశోధనలు), తమిళనాడుకు చెందిన నటేశన్ తదితరులు ఉన్నారు.
News January 25, 2026
అగ్నిప్రమాద మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

TG: నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో <<18951833>>మృతుల<<>> కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ హరిచందనకు ఆదేశాలు జారీ చేశారు. షాపు యజమాని నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అగ్నిమాపక నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.


