News January 29, 2025

T20 ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన వరుణ్ చక్రవర్తి

image

భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ICC T20 ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు. నిన్న ENGపై 5 వికెట్లతో అదరగొట్టి తన కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. 3 T20ల్లో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి 7.08 ఎకానమీతో 10వికెట్లు తీశారు. ఈ క్రమంలోనే 25 ర్యాంకులు ఎగబాకి 5వ స్థానానికి చేరారు. అలాగే T20ల్లో కుల్దీప్, భువీ తర్వాత 2సార్లు 5వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గానూ నిలిచారు.

Similar News

News November 20, 2025

ఆగని పైరసీ.. కొత్తగా ‘ఐబొమ్మ వన్’

image

ఆన్‌లైన్‌లో మరో పైరసీ సైట్ పుట్టుకొచ్చింది. కొత్తగా ‘ఐబొమ్మ వన్’ ప్రత్యక్షమైంది. అందులోనూ కొత్త సినిమాలు కనిపిస్తున్నాయి. ఏదైనా సినిమాపై క్లిక్ చేస్తే ‘మూవీ రూల్జ్’కు రీడైరెక్ట్ అవుతోంది. ఐబొమ్మ ఎకో సిస్టంలో 65 మిర్రర్ వెబ్‌సైట్లు ఉన్నాయని, అందులో ఐబొమ్మ వన్‌ను ప్రచారంలోకి తెచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ రూల్జ్, తమిళ్MV సైట్లపైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.

News November 20, 2025

రైతులకు బాబు వెన్నుపోటు: YCP

image

AP: ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం చంద్రబాబు రైతులకు వెన్నుపోటు పొడిచారని వైసీపీ విమర్శించింది. అన్నదాత సుఖీభవ పథకం తొలి రెండు విడతల్లో <<18329772>>7 లక్షల మంది<<>> లబ్ధిదారులను తొలగించారని ఆరోపించింది. వైసీపీ హయాంలో 53.58 లక్షల మందికి ఈ పథకం కింద డబ్బులు అందేవని వెల్లడించింది. అలాగే పంటలకు మద్దతు ధరలు కూడా ఇవ్వట్లేదని ట్వీట్ చేసింది.

News November 20, 2025

పిల్లల్లో అధిక రక్తపోటు లక్షణాలు

image

ప్రస్తుతకాలంలో పిల్లల్లోనూ హైబీపీ కనిపిస్తోంది. సకాలంలో గుర్తించి, చికిత్స చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో హైబీపీ ఉంటే తలనొప్పి, వాంతులు, ఛాతీ నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి వంశ చరిత్రలో బీపీ ఉంటే పిల్లలకు ఆరేళ్లు దాటిన తర్వాత ఏడాదికోసారి బీపీ చెక్ చేయడం మంచిది. జీవనశైలి మార్పులతో దీన్ని తగ్గించొచ్చని సూచిస్తున్నారు.