News March 14, 2025

రోహిత్ శర్మపై వరుణ్ ప్రశంసలు

image

ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కెప్టెన్ రోహిత్ శర్మ తనను చక్కగా ఉపయోగించుకున్నారని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చెప్పారు. ‘పవర్ ప్లేలో 2 ఓవర్లు, చివర్లో 2, 3 ఓవర్లు, మిడిల్ ఓవర్లలో వికెట్ కావాల్సినప్పుడు బౌలింగ్ చేస్తాను. ఇదే నా బలం అని రోహిత్ శర్మతో చెప్పాను. ఆయన మరో మాట మాట్లాడకుండా నేను చెప్పింది అర్థం చేసుకున్నారు. రోహిత్ శర్మ ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్లలో ఒకరు’ అని వరుణ్ ఓ ఇంటర్వ్యూలో కొనియాడారు.

Similar News

News November 17, 2025

OFFICIAL: ఎల్లుండి అకౌంట్లలోకి రూ.7,000

image

AP: ఈ నెల 19న పీఎం కిసాన్‌తో పాటు అన్నదాత సుఖీభవ స్కీమ్‌నూ అమలు చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రెండో విడతలో రాష్ట్ర వాటా రూ.5వేలు, కేంద్రం వాటా రూ.2వేలు కలిపి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. కడప జిల్లా కమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ నిధులను విడుదల చేస్తారన్నారు. మొత్తంగా 46,62,904 మంది రైతులకు రూ.3,077 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని వివరించారు.

News November 17, 2025

పెద్దపల్లి: కారు ఢీకొని ఒకరు మృతి

image

పెద్దపల్లి పట్టణ పరిధి బంధంపల్లిలోని రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బంధంపల్లి వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఓ కారు ఢీ కొట్టింది. దీంతో బైకర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలికి పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ చేరుకొని ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. కాగా, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.