News November 14, 2024
వరుణ్ తేజ్ ‘మట్కా’ రివ్యూ

చిన్నప్పటి నుంచి రౌడీయిజం ఫాలో అయిన హీరో గ్యాంబ్లింగ్ కింగ్‌గా ఎదగడం, చివరికి ఏమయ్యాడనేదే కథ. డిఫరెంట్ గెటప్‌లు, నటనతో వరుణ్ తేజ్ మెప్పించారు. కెమెరా వర్క్ బాగుంది. పాత స్టోరీని కొత్తగా చూపించడంలో డైరెక్టర్ కరుణ కుమార్ ఫెయిల్ అయ్యారు. జి.వి ప్రకాశ్ మ్యూజిక్ తేలిపోయింది. స్టోరీ మధ్యలో ప్లేస్మెంట్ లేకుండా వచ్చే సాంగ్స్, లెంగ్తీ డైలాగ్స్ ప్రేక్షకులను ఇబ్బంది పెడతాయి.
RATING: 2/5
Similar News
News November 17, 2025
తెలంగాణ న్యూస్ అప్డేట్స్

*CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం రాష్ట్ర క్యాబినెట్ భేటీ కానుంది. స్థానిక ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం.
*కాంగ్రెస్, ప్రభుత్వంలో నేతల పనితీరు ఆధారంగా ప్రక్షాళన చేయాలని AICC కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. కొన్ని కలుపు, గంజాయి మొక్కలు ఉన్నాయని, వాటిని ఏరిపారేయాలని చెప్పారు.
* యాదగిరి గుట్టకు లక్షమందికి పైగా భక్తుల రాక. ఒక్క రోజే రూ.కోటికి పైగా ఆదాయం వచ్చినట్లు అధికారుల వెల్లడి.
News November 17, 2025
ఏపీ న్యూస్ అప్డేట్స్

*ఉత్పత్తిని బట్టి జీతం ఇస్తామని వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సర్క్యులర్ జారీ చేయడంపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం. సర్క్యులర్‌ను విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్.
* చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే స్టీల్ ప్లాంట్‌ను ఏదో ఒకటి చేసేలా ఉన్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
* ఇక నుంచి పాలిటిక్స్‌లో యాక్టివ్ అవుతానని వంగవీటి రంగా కూతురు ఆశ కిరణ్ ప్రకటన. ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయించుకోలేదని వెల్లడి.
News November 17, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


