News February 2, 2025

వసంత పంచమి.. బాసర ఆలయానికి పోటెత్తిన భక్తులు

image

TG: వసంత పంచమి సందర్భంగా నిర్మల్ జిల్లాలోని బాసర ఆలయానికి భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అక్షరాభ్యాస పూజలకు 2 గంటలు, అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. వసతులు సరిగా లేవని పలువురు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

Similar News

News February 2, 2025

అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చారు: KTR

image

TG: ఆకలి చావులు, ఆత్మహత్యల తెలంగాణను KCR తన పదేళ్ల పాలనతో దేశానికే అన్నపూర్ణగా నిలబెట్టారని KTR అన్నారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ నాయకులు అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రైతులు, ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకున్న వార్తలను Xలో పోస్ట్ చేశారు. ‘ఇది ప్రజాపాలన కాదు. ప్రజలను వేధించే పాలన. జాగో తెలంగాణ జాగో’ అని పేర్కొన్నారు.

News February 2, 2025

90sలో మేం తీసుకున్న పెద్ద నిర్ణయం అదే: సచిన్

image

విలువలు పాటించే విషయంలో తనకు తన కుటుంబం ఎంతో మద్దతునిచ్చిందని సచిన్ టెండూల్కర్ చెప్పారు. నమన్ అవార్డ్స్ ఈవెంట్‌లో మాట్లాడుతూ ’90వ దశకం మధ్యలో రెండేళ్లు నేను బ్యాట్ కాంట్రాక్టు లేకుండా ఆడాను. ఆ సమయంలో ఆల్కహాల్, టొబాకో కంపెనీలు తమ ప్రచారం కోసం బ్యాట్‌లను మాధ్యమంగా వాడుకున్నాయి. అందుకే వాటిని ప్రోత్సహించొద్దని మా ఇంట్లో డిసైడ్ అయ్యాం. 90sలో మేం తీసుకున్న పెద్ద నిర్ణయం అదే’ అని వెల్లడించారు.

News February 2, 2025

GBS కలకలం.. పెరుగుతున్న మరణాలు

image

మహారాష్ట్రలో గిలియన్ బార్ సిండ్రోమ్‌తో మరో మరణం సంభవించింది. నాందేడ్‌లో 60 ఏళ్ల వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో ఆ రాష్ట్రంలో GBS మరణాల సంఖ్య 5కు పెరిగింది. మరోవైపు పుణేలో కేసుల సంఖ్య 149కి చేరింది. తాజాగా అస్సాంలో తొలి GBS మరణం నమోదైంది. ఇటీవల తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన <<15316737>>ఓ మహిళ<<>> ఈ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే.