News January 27, 2026

VASTHU: చీపురును ఎక్కడ ఉంచాలంటే..?

image

ఇంట్లో చీపురును నిలబెట్టకూడదని, ఇతరులకు కనిపించేలా గుమ్మాల వద్ద ఉంచవద్దని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇల్లు తుడవడం ముగిశాక దాన్ని పడుకోబెట్టాలంటున్నారు. ‘చీపురు ఉంచడానికి ఈశాన్యం, తూర్పు, ఉత్తర దిశలు మంచివి కావు. పడమర/దక్షిణ దిశలో ఉంచాలి. ముఖ్యంగా బాత్రూం, స్టోర్‌రూమ్‌లలో చీపురు ఉండకూడదు. చీపురును రహస్యంగా, అడ్డంగా ఉంచడం వల్ల ఇంట్లో సిరిసంపదలు నిలుస్తాయి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

Similar News

News February 20, 2026

కొత్త బాస్‌లు వీరేనా?

image

TG: వచ్చేనెలలో CS రామకృష్ణారావు పదవీకాలం ముగియనుండగా వికాస్ రాజ్, జయేశ్ రంజన్, సవ్యసాచి పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. జయేశ్‌కు అడ్మినిస్ట్రేషన్‌పై పట్టుండటంతో CM సానుకూలంగా ఉన్నారు. వచ్చే ఏడాదే ఆయనతో పాటు సవ్యసాచి రిటైర్మెంట్ కానుండటం ప్రతికూలంగా మారింది. 2028 వరకు సర్వీస్‌ ఉన్న వికాస్‌కు ఎక్కువ ఛాన్సుంది. రామకృష్ణారావు పొడిగింపుపైనా ఆలోచిస్తోంది. DGP నియామకంలో CV ఆనంద్ పేరు వినిపిస్తోంది.

News February 20, 2026

పంటలను నాశనం చేస్తున్న ఆఫ్రికన్ నత్తలు

image

పంటలపై ఆఫ్రికన్ నత్తల దాడుల ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయాయి. ఇవి పొలాలు, తోటల్లో చేరి మొక్కల ఆకులు, కాయలు, పండ్లను తినడం వల్ల తీవ్ర పంట నష్టం కలగడంతో పాటు రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా బొప్పాయి, మామిడి, అరటి, కాఫీ, రబ్బరు, పత్తి, రాగులు, కొబ్బరి, పొద్దుతిరుగుడు, అపరాలు, నూనెగింజలు, వంగ, దోస, క్యాబేజి, బెండ, మల్బరీ, బంతి తోటల్లో వీటి ముప్పు ఎక్కువైందని నిపుణులు చెబుతున్నారు.

News February 20, 2026

నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్‌లో 28 పోస్టులు

image

CSIR-నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ 28 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మార్చి 11, 12తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, టర్నర్, MMV, డ్రాఫ్స్‌మెన్ మెకానికల్‌కు నెలకు స్టైపెండ్ రూ.10,560, వెల్డర్‌కు రూ.9600 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nal.res.in