News November 24, 2024

వాయుగుండం.. మూడు రోజులు భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 27, 28, 29న దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

Similar News

News November 22, 2025

బాలికలకు సంతూర్ స్కాలర్‌‌షిప్.. రేపే లాస్ట్ డేట్

image

ఉన్నత విద్య కోర్సులు చదువుతున్న గ్రామీణ పేద విద్యార్థినులకు విప్రో అందించే సంతూర్ ఉమెన్ స్కాలర్‌షిప్‌ అప్లై చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్. AP, మహారాష్ట్ర ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థినులు అర్హులు. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి. వీరికి 30వేల రూపాయలు అందుతుంది.
వెబ్‌సైట్: <>https://www.santoorscholarships.com/‌<<>>

News November 22, 2025

రైతులకు గుడ్ న్యూస్.. ఫసల్ బీమా యోజనలో మార్పులు!

image

PM ఫసల్ బీమా యోజనలో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఇకపై జంతువుల దాడి, వరదలు/నీట మునగడం వల్ల పంట నష్టం వాటిల్లితే పరిహారం ఇవ్వనుంది. ఇప్పటిదాకా కరవు, వడగళ్లు, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులే స్కీమ్‌లో ఉండేవని, కొత్తగా ఈ రెండింటిని చేర్చామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు. రైతుల వినతిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 2026-27 ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేయనున్నట్లు చెప్పారు.

News November 22, 2025

‘నక్క’ బుద్ధి చూపించింది!.. భారతీయుల ఆగ్రహం

image

ఆస్ట్రేలియాకు చెందిన ఫాక్స్ క్రికెట్‌ ఛానల్‌పై క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో మ్యాచ్‌ అయితే ఒకలా, ఆస్ట్రేలియాలో అయితే మరోలా మాట్లాడుతోందని అంటున్నారు. యాషెస్‌ టెస్టులో తొలి రోజు 19 వికెట్లు పడ్డాయంటూ గొప్పగా రాసుకొచ్చింది. అయితే ఇటీవల INDvsSA టెస్టు మ్యాచ్‌లో ఒకేరోజు 15 వికెట్లు పడటంపై “RIP TEST CRICKET” అంటూ పేర్కొంది. దీంతో ‘నక్క’ బుద్ధి చూపిస్తోందని ట్రోల్ చేస్తున్నారు.