News October 16, 2024

వాయుగుండం.. తెలంగాణలో వర్షాలు

image

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం ప్రభావం తెలంగాణపైనా కనిపిస్తోంది. నిన్నటి నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా ముసురు మొదలైంది. వాయుగుండం రేపు తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీంతో మరో రెండు రోజుల వరకు తెలంగాణలోనూ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Similar News

News October 23, 2025

అసత్య ప్రచారానికి చెక్ పెట్టేందుకు రైల్వే ఫ్యాక్ట్ చెక్

image

భారత రైల్వేకు సంబంధించి అసత్య ప్రచారానికి చెక్ పెట్టేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఫ్యాక్ట్ చెక్‌ను తీసుకొచ్చింది. తప్పుడు సమాచారాన్ని ఎదుర్కొనేందుకు X హ్యాండిల్‌ను తీసుకొచ్చినట్లు పేర్కొంది. రైల్వేల గురించి తప్పుదారి పట్టించే లేదా తప్పుడు సమాచారం కనిపిస్తే <>IRFactCheck<<>>ను ట్యాగ్ చేయాలని కోరింది. వాస్తవాలను ట్రాక్‌లో ఉంచేందుకు సహాయపడాలని కోరింది.

News October 23, 2025

ఆకుకూరల్లో చీడపీడల నివారణకు సూచనలు

image

ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఆకుకూరల పంటల్లో అనేక చీడపీడలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆకుల అడుగు బాగాన తెల్లని బొడిపెలు, పైభాగాన లేత పసుపు రంగు మచ్చలు ఏర్పడి పండు బారుతున్నాయి. వీటి నివారణకు లీటరు నీటికి కాపర్ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాముల మందును కలిపి ఆకుల అడుగు భాగం తడిసేలా పిచికారీ చేయాలి. గొంగళి పురుగులు ఆకులను కొరికి తింటుంటే లీటరు నీటికి కార్బరిల్ మందును రెండు గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.

News October 23, 2025

నేడు అన్నాచెల్లెళ్ల పండుగ.. మీరు చేస్తున్నారా?

image

రాఖీ లాగే కార్తీక శుక్ల పక్ష విదియ నాడు ‘భాయ్‌దూజ్’ పేరిట అన్నాచెల్లెళ్ల పండుగ నిర్వహిస్తారు. ఈ శుభదినాన యమునా దేవి తన సోదరుడు యముడికి ఆప్యాయంగా భోజనం పెట్టి, ఆయనకు అపమృత్యు భయం లేకుండా దీవించిందట. అందుకే సోదరీమణులు ఈ పర్వదినాన తమ సోదరులను ఇంటికి పిలిచి కడుపు నిండా భోజనం పెడతారు. సోదరుడు, సోదరి చేతి భోజనం తింటే దీర్ఘాయుష్షు కలుగుతుందని నమ్ముతారు. మీరు ఈ పండుగ చేస్తున్నారా? COMMENT