News January 4, 2026

VCSC నూతన కార్యవర్గం ప్రకటన.. పౌర భద్రతే లక్ష్యం

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ మార్గదర్శకత్వంలో విశాఖ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (VCSC) నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. సైబర్ సెక్యూరిటీ, మహిళా-శిశు సంరక్షణ, ట్రాఫిక్, యాంటీ నార్కోటిక్స్ విభాగాలకు ప్రత్యేక ఫోరమ్‌లను ఏర్పాటు చేశారు. కళాశాలల్లో అవగాహన సదస్సులు, ‘జూనియర్ కాప్’, ‘సైబర్ వారియర్స్’ వంటి కార్యక్రమాల ద్వారా పోలీస్-ప్రజల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే దీని ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.

Similar News

News January 5, 2026

మహిళల భద్రతకు సఖి వాహనం: కలెక్టర్

image

మహిళల భద్రత, సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ స్టాప్ సెంటర్ సఖి వాహనాన్ని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఎలాంటి భయాందోళన లేకుండా స్వేచ్ఛగా ప్రయాణించేందుకు, అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించేందుకు ఈ వాహనం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జిల్లాలో మహిళలు, బాలికల రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

News January 5, 2026

కౌన్సిల్ ఆమోదం లేకుండా టెండర్లు: పీతల మూర్తి ఫిర్యాదు

image

జీవీఎంసీలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ముడసర్లోవ భూములపై రక్షణ ఏర్పాటు చేసి కబ్జాలు తొలగించాలని కమిషనర్ కేతన్ గార్గ్‌కు అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు. గుర్రాల పార్కు టెండర్ రద్దు చేయాలన్నారు. గత ప్రభుత్వం కౌన్సిల్ ఆమోదం లేకుండా ఆరు కోట్ల రూపాయలు టెండర్లు ఖరారు చేశారని ఆరోపించారు. ఇటీవల అధికారులు కూడా కౌన్సిల్‌కు తెలియకుండా చెల్లింపులు చేశారన్నారు.

News January 5, 2026

అధికారులకు విశాఖ కలెక్టర్ వార్నింగ్

image

విశాఖ కలెక్టరేట్లో సోమవారం జరిగిన రెవెన్యూ క్లినిక్‌లో కలెక్టర్ హరేందిర ప్రసాద్ పాల్గొన్నారు. భూములకు సంబంధించి వస్తున్న సమస్యలను వీలైనంతవరకు సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారంలో దళారులు, రాజకీయ నాయకులు చెప్పిన వారి నుండే అర్జీలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, అలా చేస్తే సస్పెండ్ చేస్తామన్నారు. భూసమస్యలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.