News October 16, 2024

VEENA-VANI: విడిపోని బంధానికి 22 ఏళ్లు

image

TG: అవిభక్త కవలలు వీణా-వాణి 22వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం వీరు హైదరాబాద్‌లోని శిశువిహార్‌లో ఉంటూ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. కాగా 2006లో వీరిద్దరినీ వేరు చేసేందుకు ముంబైలోని బ్రీచ్ కండి ఆస్పత్రి వైద్యులు ప్రయత్నించినా కుదర్లేదు. ఆ తర్వాత వివిధ దేశాలకు చెందిన స్పెషలిస్టులు వచ్చినా వారిని విడదీయలేక చేతులెత్తేశారు. వయసు పెరుగుతుండటంతో రోజురోజుకు నరకయాతన అనుభవిస్తున్నారు.

Similar News

News November 6, 2025

రూ.18వేల కోట్ల షేర్ల బైబ్యాక్.. డేట్ ఫిక్స్

image

ఇన్ఫోసిస్ ఈ నెల 14న ₹18వేల కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనుంది. ఈ బైబ్యాక్‌కు నందన్ నీలేకని, సుధామూర్తి సహా కంపెనీ ప్రమోటర్లు దూరంగా ఉండనున్నారు. వీరికి సంస్థలో 13.05% వాటా ఉంది. వాటాదారులకి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. 10Cr షేర్లను ₹1,800 చొప్పున కంపెనీ కొనుగోలు చేయనుంది.(కంపెనీ తన సొంత షేర్లను బహిరంగ మార్కెట్/వాటాదారుల నుంచి కొనుగోలు చేయడాన్ని బైబ్యాక్ అంటారు)

News November 6, 2025

సచివాలయాలకు అందరికీ ఆమోదయోగ్యమైన పేరే: మంత్రి డోలా

image

AP: ప్రజల కోరిక మేరకే గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మారుస్తున్నామని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యమైన పేరే పెట్టనున్నట్లు స్పష్టం చేశారు. సచివాలయ వ్యవస్థలో సీఎం చంద్రబాబు సమగ్ర మార్పులు తీసుకొస్తున్నట్లు చెప్పారు. సచివాలయ ఉద్యోగులకు కనీసం జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కూడా ఇవ్వకుండా గత ప్రభుత్వం వారి జీవితాలతో ఆడుకుందని మంత్రి విమర్శించారు.

News November 6, 2025

20న తిరుపతికి రాష్ట్రపతి

image

AP: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 20, 21 తేదీల్లో తిరుపతిలో పర్యటించనున్నారు. 20న తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఆమె దర్శించుకుంటారు. 21న తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అదేరోజు శ్రీ వరాహస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.