News February 12, 2025
నేరం అంగీకరించిన వీర రాఘవరెడ్డి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739365252085_81-normal-WIFI.webp)
TG: చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై దాడి కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించారు. తన ‘రామరాజ్యం’ సంస్థలో సభ్యులను చేర్పించాలని, ఆర్థిక సాయం చేయాలని రంగరాజన్‌ను రాఘవరెడ్డి గతంలో కోరారు. ఆయన అంగీకరించకపోవడంతో ఈ నెల 7న ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఈ కేసులో 22 మందిని నిందితులుగా చేర్చగా, ఇప్పటివరకు ఆరుగురు అరెస్ట్ కాగా, 16 మంది పరారీలో ఉన్నారు.
Similar News
News February 12, 2025
23న జనసేన శాసనసభా పక్ష భేటీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739373775626_81-normal-WIFI.webp)
AP: ఫిబ్రవరి 23న జనసేన పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సాయంత్రం జరిగే ఈ భేటీలో పాల్గొనాలని ఎంపీలు, MLAలు, MLCలను పార్టీ ఆదేశించింది. 24వ తేదీన బడ్జెట్ సమావేశాలు పాల్గొననున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
News February 12, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’ బుల్లిరాజు తండ్రి పోలీస్ కంప్లైంట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739361930288_1045-normal-WIFI.webp)
‘సంక్రాంతికి వస్తున్నాం’లో బుల్లి రాజు పాత్రతో బాలనటుడు రేవంత్ భీమాల అందర్నీ ఆకట్టుకున్నాడు. అతడి పేరిట కొన్ని ట్విటర్, ఇన్‌స్టా ఖాతాలు రాజకీయ విమర్శలు చేస్తుండటంతో అతడి తండ్రి శ్రీనివాసరావు పోలీసుల్ని ఆశ్రయించారు. ఆయా ఖాతాలపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన ఇన్‌స్టా పోస్ట్‌లో తెలిపారు. రేవంత్ భీమాల అన్న పేరిట ఉన్న ఇన్‌స్టా మాత్రమే తమదని, రేవంత్‌ను వివాదాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు.
News February 12, 2025
భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737374916723_893-normal-WIFI.webp)
AP: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి చేసింది. భక్తులు వారికి నిర్దేశించిన సమయానికే క్యూలైన్లలోకి ప్రవేశించాలని సూచించింది. కొంతమంది భక్తులు కేటాయించిన సమయానికి ముందే క్యూలైన్ల వద్దకు వెళ్లి అనుమతించాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారని ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. సోషల్ మీడియాలో TTDపై వారంతా అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు.