News November 15, 2024

ఫైనల్ దశకు ‘వీరమల్లు’ షూటింగ్

image

జ్యోతికృష్ణ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పవర్ స్టార్ లేని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. తదుపరి షెడ్యూల్‌లో పవన్ పాల్గొంటారని, దీంతో షూటింగ్ పూర్తవుతుందని టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది మార్చి 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మూవీ విడుదల కానుంది.

Similar News

News November 7, 2025

కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్: CM రేవంత్

image

TG: గతంలో అభివృద్ధి చేసిన PJR, మర్రి శశిధర్ రెడ్డి HYD బ్రదర్స్ అయితే, ఇప్పుడు డెవలప్‌మెంట్‌ను అడ్డుకుంటున్న KTR, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అని CM రేవంత్ విమర్శించారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ, RRRను అడ్డుకుంటోంది వీరేనని మండిపడ్డారు. BRS హయాంలో ఎవరికీ ఉద్యోగాలు రాలేదన్నారు. KCR, KTR, హరీశ్ రావు వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని CM దుయ్యబట్టారు.

News November 7, 2025

నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

image

<>నేషనల్<<>> హౌసింగ్ బ్యాంక్‌ 16 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో 6 రెగ్యులర్, 10 కాంట్రాక్ట్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఈనెల 28వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సీఏ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎం, బీఈ, ఎంఈ, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PWBDలకు రూ.175. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.nhb.org.in

News November 7, 2025

బ్యూటీ యాంగ్జైటీకి గురవుతున్నారా?

image

చాలామంది అమ్మాయిలు తరచూ అందాన్ని గురించి ఆలోచించడం, ఇతరులతో పోల్చుకోవడం చేస్తుంటారు. దీని వల్ల బ్యూటీ యాంగ్జైటీకి గురయ్యే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే రోజూ సరిపడా ఆహారం తింటూనే క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేస్తూ ఆరోగ్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ పెంచుకోవాలంటున్నారు. ఒత్తిడి, ప్రతికూల ఆలోచనలు దూరం పెట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలుపెట్టాలని సూచిస్తున్నారు.