News June 29, 2024
పవన్ 25 రోజుల టైమ్ కేటాయిస్తే ‘వీరమల్లు’ పూర్తి: రత్నం

హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయిందని నిర్మాత AM రత్నం చెప్పారు. ఆయన 20-25 రోజులు కేటాయిస్తే మిగతాది కంప్లీట్ అవుతుందన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘పవన్ బిజీ షెడ్యూల్‌ను బట్టి షూటింగ్ ప్రణాళిక సిద్ధం చేస్తాం. డిసెంబర్‌లో మూవీ విడుదలకు ప్రయత్నిస్తాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సినిమాలో పవన్ యాక్షన్ సీన్స్ హైలైట్‌గా నిలుస్తాయి’ అని పేర్కొన్నారు.
Similar News
News November 21, 2025
ఢిల్లీ హైకోర్టులో గౌతమ్ గంభీర్‌కు ఊరట

భారత్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో లైసెన్స్ లేకుండా కొవిడ్-19 మందులు నిల్వ చేసి, పంపిణీ చేశారని గంభీర్, కుటుంబ సభ్యులు, ఛారిటబుల్ ఫౌండేషన్‌పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటిని కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ తీర్పు చెప్పారు. ఫిర్యాదును కొట్టివేస్తున్నట్టు వెల్లడించారు. పూర్తి తీర్పు రావాల్సి ఉంది.
News November 21, 2025
ఆముదంతో ఎన్నో లాభాలు

చాలామంది ఇళ్లల్లో లభించే ఆముదం నూనెలో ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, యాంటి ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకు, చర్మానికి కూడా మేలు చేస్తాయి. ఇది వాడటం వల్ల జుట్టుకు అవసరమైన పూర్తి పోషణ అందుతుంది. జుట్టు రాలడం, చిట్లి పోవడం తగ్గి, కుదుళ్లు బలపడతాయి. ఎక్కువ జిడ్డుగా ఉంటుందని చాలామంది దీన్ని వాడటం మానేస్తారు. కానీ జుట్టు పెరగాలని కోరుకునేవారు ఆముదం నూనె ఎంచుకోవచ్చు.
News November 21, 2025
కృష్ణా జలాలపై జగన్ హెచ్చరిక

AP: కృష్ణా జలాల విషయంలో మరోసారి సంక్లిష్ట పరిస్థితి ఏర్పడిందని YCP అధినేత YS జగన్ ట్వీట్ చేశారు. CM చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపైనే రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే KWDT-II విచారణలో తెలంగాణ 763 TMCలను డిమాండ్ చేస్తోందని, బచావత్ ట్రైబ్యునల్ APకి కేటాయించిన 512 TMCల్లో ఒక్క చుక్కనూ కోల్పోకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని హెచ్చరించారు.


