News March 24, 2024

లోక్‌సభ ఎన్నికల్లో వీరప్పన్ కూతురు పోటీ

image

గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యారాణి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. తమిళనాడులోని కృష్ణగిరి నియోజకవర్గం నుంచి నామ్ తమిళర్ కట్చి పార్టీ తరఫున ఆమె బరిలోకి దిగనున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆమె జులై 2020లో BJPలో చేరారు. రాష్ట్ర యువజన విభాగానికి ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఇటీవలే ఆ పార్టీని వీడి NTKలో చేరడంతో ఆ పార్టీ ఆమెకు ఎంపీ టికెట్‌ను కేటాయించింది.

Similar News

News November 2, 2024

ఉద్యోగి ఆత్మహత్యపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

image

విధులకు సంబంధించి పైస్థాయి వ్య‌క్తి తీసుకున్న నిర్ణ‌యాలు ఉద్యోగి ఆత్మహత్యకు కారణంగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లోని వ్యక్తుల నిర్ణయాలు ఉద్యోగుల‌కు కొన్నిసార్లు క‌ష్ట‌త‌రంగా అనిపించ‌వచ్చు. అయితే హానికారక ఉద్దేశం లేకపోతే ఉద్యోగి ఆత్మ‌హ‌త్య‌కు వారిని బాధ్యులుగా ప‌రిగ‌ణించ‌లేం’ అని బీఆర్ అంబేడ్కర్ కాలేజీ(Delhi వర్సిటీ) EX ప్రిన్సిపల్ కేసులో పేర్కొంది.

News November 2, 2024

రేపు ఏం జరుగుతుంది? సర్వత్రా ఉత్కంఠ

image

NZతో మూడో టెస్టులో భారత్ గెలుస్తుందా లేదా అనేది రేపు తేలనుంది. ఇప్పటికే 143 పరుగుల ఆధిక్యంలో ఉన్న NZ, INDకు 160 పరుగుల టార్గెట్ ఇచ్చే ఛాన్సుంది. దీనిని ఛేదించడం INDకు అంత సులభమేం కాదు. వాంఖడేలో ఇప్పటివరకు అత్యధిక రన్స్ ఛేజ్ చేసిన రికార్డు SA (163vsIND) పేరిట ఉంది. ఈ నేపథ్యంలో రేపు ఏం జరుగుతుందనే దానిపై క్రికెట్ ఫ్యాన్స్‌లో ఉత్కంఠ నెలకొంది. రేపు టీమ్‌ఇండియా గెలుస్తుందా? కామెంట్ చేయండి.

News November 2, 2024

ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసు సిట్‌కు బదిలీ

image

TG: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ విగ్రహం ధ్వంసం కేసు విచారణను సిట్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై ఇప్పటివరకు సిట్ 3 కేసులు నమోదు చేసింది. అటు విగ్రహం ధ్వంసం చేసిన ప్రధాన నిందితుడు సల్మాన్ సలీంకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితుడ్ని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.