News March 19, 2024
కడప TDP ఎంపీ అభ్యర్థిగా వీరశివారెడ్డి?

AP: వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా వీరశివారెడ్డి(కమలాపురం మాజీ ఎమ్మెల్యే)ని బరిలో నిలపాలని టీడీపీ యోచిస్తోంది. ఆయన పేరుతో కొన్ని రోజులుగా IVRS సర్వే చేస్తోంది. 2014లో పోటీ చేసిన రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ఈసారి విముఖత చూపుతున్నట్లు సమాచారం. కాగా కడప ఎంపీ స్థానంలో టీడీపీ కేవలం ఒక్కసారే(1984లో నారాయణరెడ్డి) గెలిచింది. 1989 నుంచి వైఎస్ కుటుంబసభ్యులే విజయం సాధిస్తున్నారు.
Similar News
News February 13, 2026
మహాశివరాత్రి రోజు నాన్-వెజ్ అమ్మకాలపై నిషేధం

మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15న (ఆదివారం) బెంగళూరులో జంతు వధ, మాంసం అమ్మకాలను నిషేధిస్తూ గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) ఆదేశాలు జారీ చేసింది. అథారిటీ పరిధిలోని అన్ని చికెన్, మటన్, చేపల దుకాణాలు, కబేళాలను ఆ రోజు 24 గంటల పాటు మూసేయాలని ఆదేశించింది. సాంస్కృతిక ఆచారాలు, మతపరమైన సెంటిమెంట్ల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.
News February 13, 2026
మూడేళ్ల పోరాటం.. విజయవార్త వినకుండానే..

‘ఆమె ప్రాణాలకు విలువలేదు’ అనే దుర్మార్గపు మాటపై USలో మూడేళ్లుగా న్యాయపోరాటం చేసిన కందుల జాహ్నవి తండ్రి 2 రెండు రోజుల కిందటే గుండెపోటుతో చనిపోయారు. రూ.262 కోట్ల పరిహారం <<19117214>>ఇచ్చేందుకు<<>> సియాటెల్ విభాగం నిన్నే ఒప్పందం చేసుకుంది. కేసులో విజయం సాధించిన వార్త వినకముందే తండ్రి శ్రీకాంత్ చనిపోయారు. వీరిది కర్నూలు(D) కుంభళనూరు క్యాంప్ గ్రామం. ఉన్నతవిద్య కోసం US వెళ్లిన జాహ్నవి పోలీస్ వాహనం ఢీకొని చనిపోయారు.
News February 13, 2026
వరిలో అగ్గి తెగులు – నివారణకు సూచనలు

వరి దుబ్బు చేసే దశలో అగ్గి తెగులు కనిపిస్తుంది. దీని వల్ల వరి పైర్లలో ఆకులపై నూలు కండె ఆకారం మచ్చలు కనిపిస్తాయి. ఆకుల మీద, వెన్నుల మీద గోధుమ రంగు లేదా ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. ఉద్ధృతి ఎక్కువగా ఉంటే మొక్క వెన్నువిరిగి వేలాడుతుంది. ఆకులు ఎండిపోయి తగలబడినట్లు కనిపిస్తాయి. దీని నివారణకు లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 75% 0.6gm లేదా అజాక్సీస్ట్రోబిన్+టెబుకోనజోల్ 2 ml కలిపి పిచికారీ చేసుకోవాలి.


