News May 25, 2024
వెజి‘ట్రబుల్స్’.. రేట్లు డబుల్!

TG: వేసవి కారణంగా సాగు విస్తీర్ణం తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. 2 నెలల కిందట KG ₹20 ఉన్న టమాటా ధర ₹40కి చేరింది. క్యారెట్ ₹30 నుంచి ₹50కి, వంకాయ ₹30 నుంచి ₹60కి, పచ్చి మిర్చి ₹60 నుంచి ₹120కి, బీన్స్ ₹80 నుంచి ₹140కి రేట్లు పెరిగాయి. అన్ని వెజిటెబుల్స్ ధరలు రెట్టింపు అయ్యాయి. అన్ని మార్కెట్లలో ధరలు ఇలాగే ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మీ ఏరియాలో రేట్లు ఎలా ఉన్నాయి?
Similar News
News September 16, 2025
వరికి అధికంగా యూరియా వేస్తున్నారా?

వరి నాట్లు వేసిన 2-3 వారాల మధ్య.. పైరు చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు రెండుసార్లు యూరియా వేయాలి. ప్రతిసారీ ఎకరాకు 35 నుంచి 45 కిలోల యూరియా వేస్తే సరిపోతుంది. చాలామంది రైతులు మాత్రం ఎకరాకు ఒకటిన్నర నుంచి రెండు బస్తాల వరకు యూరియా వేస్తున్నారు. అధిక యూరియా వల్ల అధిక దిగుబడి వస్తుందనే ఉద్దేశంతో రైతులు ఇలా చేస్తున్నారు. దీని వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
News September 16, 2025
‘ఆరోగ్యశ్రీ’ బంద్.. చర్చలకు అంగీకరించని సర్కార్

TG: ఆరోగ్యశ్రీ సేవల బంద్కు పిలుపునిచ్చిన ప్రైవేట్ ఆసుపత్రుల సంఘాలతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘ఇప్పటికే ₹140 కోట్ల బకాయిల్లో ₹100 కోట్లు విడుదలయ్యాయి. 150 కార్పొరేట్ ఆసుపత్రుల్లో సేవలు కొనసాగుతాయి. ఎమర్జెన్సీ సేవలు అందుతాయి. మిగతా 330 చిన్న, మధ్య తరహా ఆసుపత్రులు ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నాయి’ అని హెల్త్ మినిస్టర్ కార్యాలయ అధికారి Way2Newsకు తెలిపారు.
News September 16, 2025
విషాదం.. గుండెపోటుతో డిగ్రీ విద్యార్థిని మృతి

AP: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో డిగ్రీ విద్యార్థిని నాగమణి(18) హార్ట్ ఎటాక్తో ప్రాణాలు కోల్పోయింది. నిన్న సాయంత్రం కాలేజీ నుంచి స్నేహితులతో నడుచుకుంటూ ఇంటికి బయల్దేరింది. వారితో మాట్లాడుతుండగానే అకస్మాత్తుగా కుప్పకూలింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. మరణానికి గుండెపోటే కారణమని పేర్కొన్నారు.