News August 23, 2025
వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజులు పెంపు

20 ఏళ్లకు పైబడిన పాత వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజును కేంద్రం భారీగా పెంచింది. టూ వీలర్‌కు ₹1000 నుంచి ₹2000కి, త్రీ వీలర్‌కు ₹3,500 నుంచి ₹5,000, లైట్ మోటార్ వెహికల్స్‌కి ₹5000 నుంచి ₹10వేలకు పెంచింది. ఇంపోర్టెడ్ 2, 3 వీలర్స్ ఫీజును ₹10k నుంచి ₹20kకి, ఇంపోర్టెడ్ 4 వీలర్లలకు ₹40k నుంచి ₹80kకి, మిగతా వాహనాలకు ₹6k నుంచి ₹12kకి పెంచినట్లు ప్రకటించింది. 15-20 ఏళ్ల వెహికల్స్‌కు ఎలాంటి పెంపు లేదు.
Similar News
News August 23, 2025
సాఫ్ట్ డ్రింక్స్ బ్యాన్ చేస్తాం.. USకు LPU ఫౌండర్ వార్నింగ్

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) ఫౌండర్ అశోక్ కుమార్ మిట్టల్ అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. భారత్‌పై 50% టారిఫ్స్‌ను ఆగస్టు 27లోగా వెనక్కి తీసుకోకపోతే చండీగఢ్‌లోని తమ క్యాంపస్‌లో అమెరికా సాఫ్ట్ డ్రింక్స్, బేవరేజ్ కంపెనీలను బ్యాన్ చేస్తామని హెచ్చరించారు. తమ యూనివర్సిటీలో 40వేల మంది విద్యార్థులు ఉన్నారని, దేశంలోని అతిపెద్ద వర్సిటీల్లో ఒకటని పేర్కొన్నారు.
News August 23, 2025
ధర్మస్థల.. మాస్క్ మ్యాన్ ఇతడే!

కర్ణాటకలోని ధర్మస్థలలో హత్యాచారానికి గురైన వందలాది మహిళల మృతదేహాలను ఖననం చేసినట్లు చెబుతున్న మాజీ శానిటరీ వర్కర్ ఫొటో తొలిసారి బయటకు వచ్చింది. అతడు అబద్ధాలు చెప్పి తప్పుదోవ పట్టించినట్లు గుర్తించిన సిట్ అధికారులు.. ఇవాళ <<17491461>>అరెస్టు<<>> చేశారు. అతడి పేరు CN చిన్నయ్య అలియాస్ చెన్నా అని పోలీసులు తెలిపారు. ధర్మస్థల వివరాలు చెప్పినందుకు తనను చంపుతారనే భయంతో మాస్క్ ధరించినట్లు ఇది వరకు అతడు చెప్పాడు.
News August 23, 2025
GCC విస్తరణలో టైర్-2&3 నగరాల్లో వైజాగ్

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) విస్తరణ కోసం దేశంలోని టైర్-2 & టైర్-3 నగరాలు ముఖ్యమైన గమ్యస్థానాలుగా మారుతున్నాయి. గతంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి టైర్-1 సిటీలపై దృష్టి పెట్టిన కంపెనీలు ఇప్పుడు చిన్న నగరాల్లోనూ అవకాశాలను గుర్తిస్తున్నాయి. ఇందులో ఏపీ నుంచి వైజాగ్ ఉండగా తెలంగాణ నుంచి ఏ నగరానికీ గుర్తింపు రాలేదు. కంపెనీలు వస్తే మౌలిక వసతులు అభివృద్ధి చెంది స్థానికులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి.