News October 8, 2024
వెహికల్ స్క్రాపింగ్ పాలసీ.. రాయితీలు ప్రకటించిన ప్రభుత్వం

TG: వెహికల్ స్క్రాపింగ్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చి, అదే కేటగిరీలో కొత్త వాహనం కొంటే రాయితీ కల్పించనుంది. టూ వీలర్స్ ధర ₹లక్షలోపు ఉంటే ₹1000, ₹1-2లక్షలు అయితే ₹2,000, ₹2-3లక్షలకు ₹3,000, 4 వీలర్స్కు ధర ₹0-5లక్షలు ఉంటే ₹10,000, ₹5-10Lకు ₹20,000, ₹10-15Lకు ₹30,000, ధర ₹20లక్షలకు పైన ఉంటే ₹50,000 రాయితీ ఇవ్వనుంది.
Similar News
News November 1, 2025
అధికారులు అద్భుతంగా పని చేశారు: CM చంద్రబాబు

AP: మొంథా తుఫాన్ సమయంలో అధికారులు అద్భుతంగా పని చేశారని CM చంద్రబాబు ప్రశంసించారు. పెను ప్రమాదం తప్పిందని, ముందు జాగ్రత్తతో ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించామని అన్నారు. తన జీవితంలో చాలా తుఫాన్లు చూశానని, ఈ సారి యంత్రాంగం, టెక్నాలజీ సాయంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పారు. 602 డ్రోన్లను వినియోగించి ట్రాక్ చేశామన్నారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులకు సన్మాన పత్రాలు, మెమెంటోలు అందజేశారు.
News November 1, 2025
అయ్యప్ప దీక్ష: స్వామి అనే ఎందుకు పిలుస్తారు?

అయ్యప్ప మాలధారణలో ‘నేను’ అనే భావం ఉండదు. పేర్లు, వస్త్రాలు, దినచర్య.. వీటన్నింటినీ వదిలి దైవారాధనలో భాగమవుతారు. దీక్ష స్వీకరించాక తన వ్యక్తిత్వాన్ని విడిచి, అంతర్లీనంగా దైవ స్వరూపంగా మారతారు. జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో.. ఆ వ్యక్తిని ప్రత్యేకించి కాక, పరమాత్మ అంశగా చూస్తారు. అందుకే అయ్యప్ప ప్రతిరూపంగా వారిని ‘స్వామి’ అని పిలుస్తారు. ఇది ప్రతి భక్తుడిని భగవంతునిగా గౌరవించే గొప్ప ఆచారం.
News November 1, 2025
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

రాజస్థాన్ పిలానీలోని CSIR-సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (<


