News March 16, 2024

వెల్దండ: ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి

image

ఆర్టీసీ బస్సు టాలీ ఆటో ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన వెల్దండ మండలం కుట్ర గేట్ సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. కల్వకుర్తి మండలం యంగంపల్లి గ్రామానికి చెందిన సంపత్ (22) వెల్దండ మండలం గుండాల దేవస్థానం వద్ద బొమ్మల అమ్ముకునేవాడు. సంపత్
తన నివాసానికి వెళుతుండగా కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళుతున్న కల్వకుర్తి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.

Similar News

News September 2, 2025

పాలమూరు: AHTU.. 22 కార్యక్రమాలు

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ‘ప్రజా భద్రత పోలీసు బాధ్యత” కార్యక్రమంలో భాగంగా మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTU) గత నెల(ఆగస్టు) జిల్లా మొత్తం 22 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ఎస్పీ డి.జానకి తెలిపారు. మహిళలు, పిల్లలను అక్రమ రవాణా చేసే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపిస్తే తక్షణమే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.

News September 2, 2025

HYDలో రైలు కింద పడి MBNR వాసి ఆత్మహత్య

image

రైలు కింద పడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన HYD చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఈరోజు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మహబూబ్‌నగర్ వాసి భూక్యా పెంటానాయక్ చర్లపల్లిలోని తన చెల్లి వద్ద ఉంటూ ఐటీ కారిడార్‌లో జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈరోజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News September 2, 2025

MBNR: జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి- జిల్లా జడ్జి

image

జాతీయ రాష్ట్రన్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 13న జిల్లాలోని అన్ని కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా జడ్జి పాపిరెడ్డి అన్నారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు మోటార్ వెహికల్ యాక్సిడెంట్, ఎలక్ట్రిసిటీ, ప్రీలిటిగేషన్, డబ్బు రికవరీ, కుటుంబ తగాదాలు, బ్యాంక్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఫ్రీ లిటిగేషన్ చెక్‌బౌన్స్ కేసులను రాజీకి వీలున్న కేసులు కక్షిదారులు వినియోగించుకోవలన్నారు.