News April 24, 2024
కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్?
TG: కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ నామినేషన్ వేశారు. పార్టీ నుంచి అధికారిక ప్రకటన రాకముందే ఆయన నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది. మంత్రి పొన్నంతో సహా పలువురు జిల్లా నేతలు ఆయనతో వెళ్లి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు KNR టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి నేడు CM రేవంత్‌తో భేటీ కానున్నారు.
Similar News
News November 20, 2024
చివరి మ్యాచ్ ఆడేసిన రఫెల్ నాదల్
స్పానిష్ ప్లేయర్ రఫెల్ నాదల్ టెన్నిస్ కెరీర్‌కు తెరపడింది. డేవిస్ కప్ తర్వాత తాను రిటైర్ కానున్నట్లు ఆయన గతంలోనే ప్రకటించారు. తాజాగా జరిగిన డేవిస్ కప్ QFలో స్పెయిన్ ఓడిపోవడంతో ఆటగాడిగా ఆయన ప్రయాణం ముగిసింది. చివరగా నెదర్లాండ్స్ ప్లేయర్ జాండ్షల్ప్తో జరిగిన సింగిల్స్ మ్యాచులో 4-6, 4-6 తేడాతో ఆయన ఓడారు. మ్యాచ్ అనంతరం ఎమోషనల్ అయ్యారు. నాదల్ తన కెరీర్లో మొత్తం 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచారు.
News November 20, 2024
మతిమరుపు ఉంటేనే పని ఇస్తారు
ఇదేంటి అనుకుంటున్నారా? జపాన్‌లోని టోక్యోలో ఉండే ‘రెస్టారెంట్ ఆఫ్ మిస్టేకెన్ ఆర్డర్స్’లో మతిమరుపు ఉన్నవారిని సర్వర్లుగా నియమిస్తారు. వీరిలో ఒంటరితనం తగ్గించడానికి, చురుగ్గా మార్చేందుకు ఇలా చేస్తున్నారు. ఈ ప్రత్యేకమైన కేఫ్‌లో ఆర్డర్లు తప్పుగా వచ్చినా కస్టమర్లు ఆనందంగా స్వీకరిస్తుంటారు. 2017లో శిరు ఒగుని అనే వ్యక్తి దీనిని ప్రారంభించగా ఆదరణ పెరగడంతో ఇలాంటివి 8వేల కేఫ్‌ల వరకూ పెరిగాయి.
News November 20, 2024
స్కూల్ విద్యార్థులకు శుభవార్త
దేశ వ్యాప్తంగా జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును మరోసారి పెంచారు. నవంబర్ 26వ తేదీ వరకు విద్యార్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. జెండర్, కేటగిరీ, ఏరియా(రూరల్/అర్బన్), డిజెబిలిటీ, పరీక్ష మాధ్యమం ఫీల్డ్స్‌లో దరఖాస్తుల సవరణ అవకాశం నవంబర్ 26 తర్వాత రెండు రోజులు తెరిచి ఉంటుంది. ఏపీలో 15, TGలో 9 JNVలు ఉండగా, ఫిబ్రవరి 8న ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు.