News August 2, 2024
వేమన నీతి పద్యం- తాత్పర్యం

గొడ్డుటావు బితుక గుండ గొంపోయిన
బండ్ల నూడ దన్ను పాల నీదు
లోభివాని నడుగ లాభంబు లేదయా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: గొడ్డు ఆవు దగ్గరకి పాలు పిండటానికి పోతే తంతుందేగానీ పాలు ఇవ్వదు. అలాగే పిసినిగొట్టు వాడిని ఎంత ప్రాధేయపడినా నోరు నొప్పి పుడుతుందే కాని పైసా కూడా వాని నుంచి పొందలేము.
Similar News
News December 7, 2025
జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

జగిత్యాల జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. అత్యల్పంగా రాఘవపేటలో 11.1℃, మల్లాపూర్ 11.2, నెరెళ్ల, కథలాపూర్, పూడూర్ 11.2, గుల్లకోట, మన్నెగూడెం 11.4, కొల్వాయి, గోవిందారం 11.5, మల్యాల, పొలాస 11.8, తిరుమలాపూర్ 11.8, ఐలాపూర్ 11.9, సారంగాపూర్ 11.9, అల్లీపూర్, రాయికల్ 12.0, జగ్గసాగర్, బుద్దేశ్పల్లి 12.1, మేడిపల్లి, పెగడపల్లి 12.2, గొల్లపల్లిలో 12.5℃ గా నమోదు అయ్యాయి.
News December 7, 2025
కొడాలి నాని గురించి ప్రశ్న.. వదిలిపెట్టనన్న లోకేశ్

AP: రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోతుందని మంత్రి లోకేశ్ మరోసారి స్పష్టం చేశారు. అమెరికా డల్లాస్లో తెలుగు డయాస్పొరా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కొందరు కొడాలి నాని గురించి అడగ్గా ‘నా తల్లిని అవమానిస్తే నేను వదిలిపెడతానా? మీ తల్లిని అవమానించినా వదిలిపెట్టను. మా అమ్మ రాజకీయాలకు దూరంగా ఉన్నా అసెంబ్లీ సాక్షిగా అవమానించారు. మీకు ఎలాంటి డౌట్ వద్దు. చట్టపరంగా శిక్షిస్తాం’ అని లోకేశ్ స్పష్టం చేశారు.
News December 7, 2025
అన్నింటికీ ఆధారం ‘విష్ణుమూర్తి’

అజస్సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాది రచ్యుతః।
వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః॥
విష్ణుమూర్తికి పుట్టుక లేదు. ఆయనే అన్నింటికీ అధిపతి. ఏదైనా సాధించగలిగినవాడు. అన్నిటికంటే ముందుంటాడు. వానలు కురిపిస్తాడు. తిరిగి ఆ నీటిని స్వీకరిస్తాడు. ఆయన ఆత్మ అనంతం. కొలవడానికి వీలు కానిది. అన్ని లోకాల పరిణామం నుంచే ఈ సృష్టిని పుట్టించే శక్తి ఆయనకు ఉంది. అందుకే ఆయన అన్నింటికీ ఆధారం. <<-se>>#VISHNUSAHSARANAMAM<<>>


