News August 3, 2024
వేమన నీతి పద్యం- తాత్పర్యం

భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు
దానహీను జూచి ధనము నవ్వు
కదన భీతుజూచి కాలుడు నవ్వును
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదని తెలుసుకోలేక ఈ భూమి నాది అని అంటే భూమి నవ్వుతుంది. దానం చేయని పిసినారిని చూసి ధనం నవ్వుతుంది. ఎప్పటికైనా చావు తప్పదని తెలిసీ యుద్ధం నుంచి పారిపోయే వాడిని చూసి మృత్యువు నవ్వుతుంది.
Similar News
News March 23, 2026
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ నివాసంలో జరగనున్న ప్రైవేట్ వేడుకకు ఆయన హాజరుకానున్నారు. అనంతరం AICC అగ్రనేతలతోనూ సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు, విభజన హామీలపై కేంద్ర మంత్రులనూ కలవనున్నట్లు తెలుస్తోంది. రేపు రాత్రికి ఢిల్లీలోనే బస చేసి, ఎల్లుండి తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
News March 23, 2026
దృశ్యం-3 రిలీజ్ వాయిదా

మలయాళ నటుడు మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న దృశ్యం-3 సినిమా విడుదల వాయిదా పడింది. తన పుట్టిన రోజైన మే 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మోహన్‌లాల్ ఇన్‌స్టాలో వెల్లడించారు. ఈ మూవీని ఏప్రిల్ 2న రిలీజ్ చేస్తామని గతంలో మేకర్స్ ప్రకటించారు. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం 1, 2 చిత్రాలు సూపర్ హిట్ కాగా, వాటికి కొనసాగింపుగా మూడో భాగం వస్తోంది.
News March 23, 2026
ఎన్నికల సంఘం లెటర్‌పై బీజేపీ ముద్ర.. కేరళంలో వివాదం!

ఎన్నికల సంఘం లెటర్‌పై BJP సీల్ ఉండటం కేరళంలో వివాదానికి దారి తీసింది. తీవ్ర దుమారం రేగడంతో రాష్ట్ర CEO కేల్కర్ స్పందించారు. ‘ఎన్నికల మార్గదర్శకాలపై 2019 మార్చి 19న EC పంపిన లేఖపై వివరణ కోరుతూ ఇటీవల BJP కేరళం విభాగం CEO ఆఫీసుకు వచ్చింది. అప్పుడు ఇచ్చిన దరఖాస్తుతోపాటు EC లేఖపై పార్టీ సీల్ ఉంది. క్లెరికల్ తప్పిదం వల్ల అది సర్క్యులేట్ అయింది. పొరపాటును గుర్తించి లేఖను ఉపసంహరించుకున్నాం’ అని తెలిపారు.


