News September 19, 2024

వేమన నీతి పద్యం- తాత్పర్యం

image

కర్మ మధికమైన గడచి పోవగరాదు
ధర్మరాజు దెచ్చి తగని చోట
గంకుభట్టు జేసెగటకటా దైవంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. ప్రతికూల సమయం వచ్చినప్పుడు ధర్మరాజు కూడా విరాట రాజువద్ద కంకుభట్టు వేషాన్ని ధరించాల్సి వచ్చింది.

Similar News

News December 6, 2025

‘RO-KO’ని దాటేసిన వైభవ్ సూర్యవంశీ

image

వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచారు. 2025లో మోస్ట్ సెర్చ్‌డ్ క్రికెటర్ ఇన్ ఇండియా లిస్ట్‌లో టాప్ ప్లేస్‌ సాధించారు. ఐపీఎల్‌తో ఈ యంగ్‌స్టర్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. రెండో స్థానంలో ప్రియాన్ష్ ఆర్య, మూడో స్థానంలో అభిషేక్ శర్మ, షేక్ రషీద్ నాలుగో స్థానం, జెమీమా రోడ్రిగ్స్ ఐదో స్థానంలో నిలిచారు. IPL 2025, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ బజ్ ఉన్నా రోహిత్, కోహ్లీ ఈ లిస్టులో పేర్లు సాధించలేకపోయారు.

News December 6, 2025

‘X’కు $140 మిలియన్ డాలర్ల ఫైన్

image

యూరోపియన్ యూనియన్ ‘X’ అధినేత ఎలాన్ మస్క్‌కు షాకిచ్చింది. తమ దేశంలోని ఆన్‌లైన్ కంటెంట్ రూల్స్‌ను మస్క్ ప్లాట్‌ఫామ్ ఉల్లంఘించిందని EU టెక్ రెగ్యులేటర్స్ ఆరోపించింది. అందుకు 120($140 మిలియన్స్) మిలియన్ యూరోస్ ఫైన్ విధించింది. దీనిని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఖండించారు. “ఇది కేవలం ‘X’ మీదే కాదు అమెరికా టెక్ ప్లాట్‌ఫామ్స్, US పౌరులపై విదేశీ ప్రభుత్వాల దాడి” అని ట్వీట్ చేశారు.

News December 6, 2025

డిసెంబర్ 6: చరిత్రలో ఈ రోజు

image

1935: సినీ నటి సావిత్రి జననం
1985: భారత క్రికెటర్ ఆర్.పి.సింగ్ జననం
1988: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా జననం
1993: భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా జననం
1991: భారత క్రికెటర్ కరుణ్ నాయర్ జననం
1994: భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ జననం
1956: భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ మరణం