News June 13, 2024

వేమన నీతి పద్యం- తాత్పర్యం

image

ఏమి గొంచువచ్చె నేమి తాగొనిపోవు
బుట్టువేళ నరుడు గిట్టువేళ
ధనము లెచట కేగు దానెచ్చటికి నేగు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: పుట్టుకతో మనిషి ఏమీ తీసుకురాడు. చనిపోయినప్పుడు ఏమీ తీసుకుపోడు. అతను సంపాదించిందంతా ఎక్కడికి పోతుందో, అతను ఎక్కడికి పోతాడో(స్వర్గము, నరకము) ఎవరికీ తెలియదు.

Similar News

News January 20, 2026

మాఘ మాసంలో పెళ్లిళ్లు ఎక్కువగా ఎందుకు జరుగుతాయి?

image

ఇది కల్యాణ కారకమైన మాసం. ఈ నెలలో ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభమవుతుంది. ధర్మశాస్త్రాల ప్రకారం.. మాఘంలో పెళ్లి చేసుకున్న దంపతులు అన్యోన్యంగా, అష్టైశ్వర్యాలతో, సంతాన సౌభాగ్యంతో వర్ధిల్లుతారని నమ్మకం. ప్రకృతి పరంగా వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటం, పంటలు చేతికి వచ్చి శుభకార్యాలకు అనువైన సమయం కావడం వల్ల కూడా ఈ మాసంలో ముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ మాసం వివాహ వేడుకలకు కేంద్రబిందువుగా మారుతుంది.

News January 20, 2026

పవన్ పిలుపుతోనే ఏపీలో షూటింగ్: నవీన్ పొలిశెట్టి

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుతోనే ‘అనగనగా ఒక రాజు’ సినిమా షూటింగ్‌లో ఎక్కువ భాగం గోదావరి జిల్లాల్లో జరిగిందని హీరో నవీన్ పొలిశెట్టి తెలిపారు. ఏపీలో మూవీ షూటింగ్స్ జరగాలని ఓ కార్యక్రమంలో పవన్ చేసిన కామెంట్స్ తన హృదయాన్ని తాకాయన్నారు. చిత్రీకరణ ఎక్కడ చేసినా అధికారులు ఈజీగా పర్మిషన్లు ఇచ్చారని, పూర్తి సహకారం అందించారని తెలిపారు. నిన్న రాజమండ్రిలో నవీన్, మీనాక్షీ చౌదరి సందడి చేశారు.

News January 20, 2026

ఆర్సీబీ సరికొత్త చరిత్ర

image

WPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరికొత్త చరిత్ర సృష్టించింది. టోర్నీలో వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా నిలిచింది. గత సీజన్‌‌లో RCB తన చివరి మ్యాచ్‌లో గెలవగా ఈసారి వరుసగా ఐదు విజయాలు ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో 2024లో తొలి ట్రోఫీని గెలుచుకున్న స్మృతి సేన మరోసారి టైటిల్‌పై కన్నేసింది. నిన్న గుజరాత్‌తో మ్యాచులో విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.