News July 30, 2024

వేమన నీతి పద్యం- తాత్పర్యం

image

ఎరుకలేని దొరల నెన్నాళ్లు గొలిచిన
బ్రతుకలేదు వట్టి భ్రాంతికాని
గొడ్డుటావు పాలు గోరితే చేపునా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఎండిపోయిన ఆవును పాలు ఇవ్వమంటే ఇవ్వలేదు. అలాగే తాను చేసే కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంత కాలము చేసినా వ్యర్థమే.

Similar News

News January 18, 2026

కర్నూలులో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో రికార్డు అసిస్టెంట్-1, ఫ్రెంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్-1, డేటా ఎంట్రీ ఆపరేటర్-1, రెగ్యులర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి తెలిపారు. గడువు ఈనెల 27 వరకు ఉందన్నారు. దరఖాస్తులను రిజిస్టర్ లేదా స్పీడ్ పోస్టు ద్వారా పంపాలన్నారు. www.ecourtskurnool.com & kurnool.dcourts.gov.inను చూడాలన్నారు.

News January 18, 2026

గోరంట్ల మాధవ్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

image

అత్యాచార బాధితురాలి పేరు బయటపెట్టారంటూ నమోదైన కేసులో మాజీ MP గోరంట్ల మాధవ్‌పై విజయవాడ పోక్సో న్యాయస్థానం నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు మాధవ్‌పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆయన శుక్రవారం విచారణకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి వారెంట్‌ జారీ చేశారు. తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేశారు.