News April 21, 2024

వేమన నీతి పద్యం- భావం

image

నిండు నదులు పాఱు నిల్చి గంభీరమై
వెఱ్ఱివాగు పాఱు వేగబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: నిండుగా ఉన్న నదులు నిదానంగా, గంభీరంగా ప్రవహిస్తాయి. చిన్న వాగులు అతి వేగంగా గట్లుదాటి పొర్లి ప్రవహిస్తాయి. అలాగే యోగ్యుడు, మంచివాడు నిదానంగా, గంభీరంగా మాట్లాడతాడు. నీచుడు మాత్రం అధికంగా మాట్లాడతాడు.

Similar News

News March 4, 2026

నెయ్యి సరఫరాలో చంద్రబాబు స్కామ్‌లు: జగన్

image

AP: CM చంద్రబాబు తిరుమలను స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారని జగన్ Xలో విమర్శించారు. ‘TTD ఛైర్మన్‌పై ఓ మహిళ ఫిర్యాదు చేస్తే CBN చర్యలు తీసుకోలేదు. అతడినే పదవిలో కొనసాగించి ఆలయ ప్రతిష్ఠను కాలరాశారు. లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి దాన్ని వేరొకరికి మీదికి నెట్టారు. నెయ్యి సరఫరాను ఇందాపూర్‌ డెయిరీకి కట్టబెట్టి స్కామ్‌లు చేస్తూ సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు’ అని ఆరోపిస్తూ <>డీటెయిల్స్<<>> షేర్ చేశారు.

News March 4, 2026

శాసనమండలిలో గందరగోళం

image

AP: మండలిలో తిరుమల లడ్డూ కల్తీపై చర్చ గందరగోళానికి దారితీసింది. ఛైర్మన్ ఒకే అంశంపై 2 తీర్మానాలను చర్చకు అనుమతించడం సరికాదని మంత్రి నాదెండ్ల అన్నారు. అలా అనుమతిస్తే ప్రభుత్వ స్టేట్‌మెంట్‌ను వినాలన్నారు. అందుకు ఛైర్మన్ మోషేను రాజు అనుమతించకపోవడంతో ఇలాంటి చెడు సంప్రదాయాన్ని కొత్తగా తీసుకురావద్దని నాదెండ్ల వ్యాఖ్యానించారు. దీన్ని ఛైర్మన్ ఖండించగా, ప్రభుత్వం ఆయనను అవమానిస్తోందని YCP ఆందోళనకు దిగింది.

News March 4, 2026

మనుగడ కోసం మొదలై ప్రపంచ గుర్తింపు!

image

అవసరం కోసం పుట్టిన దావణగెరె బెన్నె దోసె నేడు కర్ణాటక రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది. 1928లో చెన్నమ్మ అనే మహిళ తన బిడ్డల ఆకలి తీర్చడం కోసం దోసెలు అమ్మడం ప్రారంభించారు. ఆమె స్వయంగా తీసిన తాజా తెల్లటి వెన్న (బెన్నె) ఈ దోసెలకు మంచి రుచిని ఇచ్చింది. కేవలం మనుగడ కోసం మొదలైన ఓ తల్లి పోరాటం.. నేడు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అద్భుతమైన అల్పాహారంగా మారింది. ఇలాంటివి మీ ప్రాంతాల్లోనూ ఉన్నాయా? COMMENT