News April 19, 2025
వేమన పద్యం

ఉన్నతావు వదలి ఊరూరు దిరిగిన
కన్నదేమి నరుడు గ్రాసమునకు
తన్నులోను జూడ తమమెల్ల వీడును
విశ్వదాభిరామ వినుర వేమ.
భావం: ఉన్నచోటును విడిచి తీర్థయాత్రలు చేసినంత మాత్రాన ఉపయోగం లేదు. తనలో తాను చూసుకుంటే అజ్ఞానం తొలగిపోతుంది.
Similar News
News April 19, 2025
ముగిసిన ఎంపీ మిథున్ రెడ్డి విచారణ

AP: మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణ ముగిసింది. అధికారులు 8 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. అనంతరం వాంగ్మూలంపై ఎంపీ సంతకం తీసుకున్నారు. మరోసారి మిథున్ రెడ్డికి నోటీసులిచ్చి విచారణకు పిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా నిన్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని అధికారులు విచారించారు.
News April 19, 2025
IPL: ముగిసిన డీసీ ఇన్నింగ్స్.. స్కోర్ ఎంతంటే..

అహ్మదాబాద్‌లో జరుగుతున్న IPL మ్యాచ్‌లో డీసీ బ్యాటింగ్ ముగిసింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఢిల్లీ 203 పరుగులు చేసింది. అశుతోశ్ (19 బంతుల్లో 37), అక్షర్ (32 బంతుల్లో 39), నాయర్ (18 బంతుల్లో 31) రాణించారు. GT బౌలర్లలో ప్రసిద్ధ్ 4, సిరాజ్, అర్షద్, ఇషాంత్, సాయి కిశోర్ తలో వికెట్ తీసుకున్నారు. GT విజయ లక్ష్యం 204 పరుగులు.
News April 19, 2025
ఇషాంత్ శర్మకు వడదెబ్బ!

అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ ఇషాంత్ శర్మకు వడదెబ్బ తగిలింది. ఆయన్ను బౌండరీ లైన్ బయటికి తీసుకెళ్లిన GT సిబ్బంది, లిక్విడ్స్ అందించి తడి టవల్స్‌తో సపర్యలు చేశారు. స్టేడియం వద్ద ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేయడంతో అటు గుజరాత్, ఇటు ఢిల్లీ జట్ల ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ సైతం ఎండ దెబ్బకు ఇబ్బంది పడ్డారు.