News July 30, 2024

వెంకటరావు ఎక్కడికీ వెళ్లరు: మంత్రి పొంగులేటి

image

TG: భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు BRSలోకి వెళ్తారనే ప్రచారాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. ‘వెంకటరావు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు. పాత పరిచయం కాబట్టి BRS వాళ్లను కలిసి ఉంటారు. మా దగ్గరకు వచ్చిన వాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాంగ్రెస్ దగ్గర ప్రేమ రాజకీయాలు ఉంటాయి. వెంకటరావే కాదు ఎవరూ ఎక్కడికీ వెళ్లరు’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News April 11, 2026

ద్వారకాతిరుమల: 26 నుంచి శ్రీవారి వైశాఖమాస కళ్యాణోత్సవాలు

image

ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వైశాఖమాస తిరు కళ్యాణోత్సవాలను ఏప్రిల్ 26 నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఈవో భద్రాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉత్సవాలలో భాగంగా శ్రీవారి కళ్యాణోత్సవం ఏప్రిల్ 30 గురువారం రాత్రి 8 గంటలకు, రథోత్సవం మే 1 శుక్రవారం రాత్రి 7:30 గంటలకు నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ 26 నుంచి మే 3వ తేదీ వరకు అన్ని సేవలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నామన్నారు.

News April 11, 2026

వామ్మో నిమ్మ.. భారీగా పెరిగిన ధర

image

AP: ఉష్ణోగ్రతలు పెరగడంతో నిమ్మ కాయల ధరలకు రెక్కలొచ్చాయి. <<19560961>>జనవరిలో కేజీ రూ.10<<>>, మూడు వారాల కిందట కేజీ రూ.30గా ఉన్న ధర ఇప్పుడు రూ.130-135కి చేరింది. రేట్లు పెరిగినా వాతావరణ మార్పులతో దిగుబడి తీవ్రంగా తగ్గిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గతంలో ఎకరాకు 40 బస్తాలు వచ్చేదని, ఇప్పుడు 15 బస్తాలు కూడా రావడం లేదంటున్నారు. మరోవైపు పెరిగిన ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.

News April 11, 2026

IPL: SRH బ్యాటింగ్

image

న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్‌ వేదికగా SRHతో మ్యాచులో పంజాబ్‌ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
SRH: హెడ్, అభిషేక్, ఇషాన్, క్లాసెన్, సలీల్, అనికేత్, నితీశ్, హర్ష్ దూబే, శివంగ్, హర్షల్, ఎషాన్ మలింగ
* ప్రఫుల్ హింగే(డెబ్యూ) IMPACT
PBKS: ప్రభ్‌సిమ్రన్, ప్రియాంశ్, కూపర్, శ్రేయస్, శశాంక్, స్టొయినిస్, యాన్సెన్, బార్ట్‌లెట్, వైశాక్, అర్ష్‌దీప్, చాహల్