News September 27, 2024
వెంకటరెడ్డికి అక్టోబర్ 10 వరకు రిమాండ్

AP: గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డికి విజయవాడ కోర్టు అక్టోబర్ 10 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను జైలుకు తరలించారు. గనుల కేటాయింపులలో పలు సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చారంటూ ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కొన్ని వారాలుగా అజ్ఞాతంలో ఉన్న వెంకటరెడ్డిని నిన్న హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News December 6, 2025
కంపెనీలు ఈ బిల్లుకు మద్దతివ్వాలి: ఉద్యోగులు

లైఫ్‌లో ఉద్యోగం ఓ పార్ట్. కానీ ప్రస్తుతం ఉద్యోగమే జీవితమైపోతోంది. టెకీలైతే రోజులో 12-14 గంటలు పనిచేస్తున్నారు. దీంతో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. పని ఒత్తిడితో కుటుంబాన్ని కూడా పట్టించుకోవట్లేదు. అందుకే ‘<<18487853>>రైట్ టు డిస్‌కనెక్ట్ బిల్లు<<>>’ను తీసుకురావాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగి మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే పనిలో ఉత్పాదకత మెరుగుపడుతుంది. ఈ బిల్లుకు కంపెనీలూ మద్దతు ఇవ్వాలంటున్నారు.
News December 6, 2025
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047 షెడ్యూల్

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్-2047 ఎల్లుండి ప్రారంభం కానుంది. హైదరాబాద్ శివారులోని ఫ్యూచర్ సిటీలో విశాలమైన ప్రాంగణంలో ఈ సదస్సు జరగనుంది. వివిధ దేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ నేతలు, దేశంలోని కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు హాజరవనున్నారు. సమ్మిట్ రెండు రోజుల షెడ్యూల్‌ను ఇక్కడ <
News December 6, 2025
సెల్యూట్ డాక్టర్.. 1.2లక్షల మందికి ఉచితంగా..!

నిస్సహాయులకు వైద్యం అందని చోట డాక్టర్ సునీల్ కుమార్ హెబ్బీ ఆశాదీపంగా మారారు. పేరు కోసం కాకుండా సేవ చేయడానికి తన కారును ‘సంచార క్లినిక్’గా మార్చుకున్నారు. బెంగళూరు వీధుల్లోని పేదలకు ఇంటి వద్దే ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. ఒక రోడ్డు ప్రమాదంతో మొదలైన ఈ గొప్ప ప్రయాణం ఇప్పటికే 1.2 లక్షల మందికిపైగా ప్రాణాలను కాపాడింది. వైద్య పరికరాలతో నిండిన ఆయన కారు ఎంతో మందికి కొత్త జీవితాన్నిస్తోంది.


