News April 4, 2025

SRHకు వెంకటేశ్ అయ్యర్ కౌంటర్?

image

క్రికెట్‌లో దూకుడు అంటే ప్రతీ బాల్‌ను బాదడం కాదని, పరిస్థితులకు తగ్గట్లు ఆడటమని KKR ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ అన్నారు. ‘బాగా ఆడినప్పుడు 250, ఆడనప్పుడు 70 రన్స్‌కు పరిమితమవ్వాలని మా జట్టు కోరుకోదు. కండీషన్స్‌ బట్టి అంచనా స్కోరుకు మరో 20 రన్స్ అదనంగా చేసేందుకు ప్రయత్నిస్తాం’ అని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలు SRHను ఉద్దేశించినవేనని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News April 10, 2025

సోషల్ మీడియాపై నిఘా.. ఇలా అయితే అమెరికా వీసా రాదు

image

సోషల్ మీడియాలో ఉగ్ర కార్యకలాపాలను ప్రచారం చేసినా, అనుకూలంగా పోస్టులు పెట్టినా ఇకపై US వీసా రాదు. హమాస్, పాలస్తీనియన్, ఇస్లామిక్ జిహాద్, లెబనాన్, హెజ్‌బొల్లా, హౌతీ వంటి గ్రూపులకు మద్దతిచ్చినట్లు తేలితే వీసాలు, గ్రీన్‌కార్డులు మంజూరు చేయబోమని US స్పష్టం చేసింది. ఉగ్రవాద సానుభూతిపరులకు తమ దేశంలో స్థానం లేదని, అలాంటి వారికి గేట్లు మూసుకుపోయినట్లేనని US డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ ప్రకటించింది.

News April 10, 2025

బాలయ్య- బోయపాటి మధ్య విభేదాలు.. క్లారిటీ!

image

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో ‘అఖండ-2’ షూటింగ్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అయితే, వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో షూటింగ్ సజావుగా జరగట్లేదనే రూమర్స్ ప్రస్తుతం టీటౌన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈక్రమంలో దీనిపై సినీవర్గాలు స్పందించాయి. వీటిలో ఎలాంటి నిజం లేదని, షూట్ సజావుగా సాగుతోందని వెల్లడించాయి. వీరి కాంబోలో మరో బ్లాక్ బస్టర్ వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాయి.

News April 10, 2025

ఏప్రిల్ 22న టెన్త్ ఫలితాలు?

image

ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 22న లేదంటే రెండ్రోజులు అటూ ఇటుగా ఫలితాలు ప్రకటిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నిన్నటితో మూల్యాంకనం పూర్తికాగా, ఫలితాలను కంప్యూటరీకరించే ప్రక్రియ మొదలుపెట్టారు. పలు దఫాల పరిశీలన పూర్తయ్యాక ఫలితాలు ప్రకటించాలని విద్యాశాఖ భావిస్తోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనుంది. bse.ap.gov.in, Way2Newsలో ఫలితాలను తెలుసుకోవచ్చు.

error: Content is protected !!