News May 11, 2024

జులైలో సెట్స్ పైకి వెంకటేశ్ కొత్త సినిమా?

image

విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ జులైలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని, ఒక హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని ఖరారు చేశారని సినీవర్గాలు తెలిపాయి. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Similar News

News December 9, 2025

ఫ్రాడ్ కాల్స్‌ వేధిస్తున్నాయా?

image

ప్రస్తుతం చాలా మందిని ఫ్రాడ్ కాల్స్‌, మెసేజ్‌లు వేధిస్తున్నాయి. అయితే వాటిపై మనం ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. సంచార్ సాథీ (<>https://sancharsaathi.gov.in/sfc/<<>>)లో అనుమానాస్పద కాల్స్‌ను సులభంగా కంప్లైంట్‌ చేయవచ్చు. వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫోన్ నంబర్, కాల్ వచ్చిన డేట్, టైమ్ వంటి వివరాలు సమర్పించాలి. ఇది టెలికం మోసాల నియంత్రణలో అధికారులకు కీలకంగా ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వలన ఇతరులను కూడా రక్షించవచ్చు.

News December 9, 2025

నువ్వుల విత్తనాలను వెదజల్లేకంటే విత్తడం మేలట

image

నువ్వుల పంట కోసం విత్తనాలను సాధారణంగా రైతులు వెదజల్లుతారు. అయితే విత్తనాన్ని వెదజల్లడం కంటే విత్తడం మేలంటున్నారు నిపుణులు. విత్తనాలను వరుసల మధ్య 30సెం.మీ, మొక్కల మధ్య 15సెం.మీ దూరం ఉండేటట్లు విత్తుకోవాలంటున్నారు నిపుణులు. విత్తనాలను వరుసలలో విత్తితే కలుపు తీసుకోవడానికి అనువుగా ఉండటమే కాకుండా మొక్కకు నీరు, పోషకాలు, సూర్యరశ్మి సమానంగా అంది కొమ్మలు బాగా వృద్ధి చెంది అధిక దిగుబడులు సాధించవచ్చు.

News December 9, 2025

మహాలక్ష్మి పథకంతో మహిళలకు రూ.8,459 కోట్లు ఆదా: పొన్నం

image

TG: మహాలక్ష్మి పథకం ద్వారా RTCలో మహిళలకు ఉచిత ప్రయాణాలు మొదలై రెండేళ్లు పూర్తయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. రెండేళ్లలో మహిళలు 251 కోట్ల జీరో టికెట్ల ద్వారా రూ.8,459 కోట్లు ఆదా చేసినట్లు వెల్లడించారు. బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాకుండా మహిళలను బస్సులకు యజమానులుగా చేసిన ప్రభుత్వంగా నిలిచిందని పేర్కొన్నారు.