News November 11, 2024
దసరా బరిలో వేణు ‘ఎల్లమ్మ’ మూవీ: దిల్ రాజు

బలగం సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ వేణు తన తదుపరి చిత్రాన్ని హీరో నితిన్‌తో తీయనున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఈ చిత్రానికి ‘ఎల్లమ్మ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలిపారు. వచ్చే దసరాకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ‘దసరా’ సినిమాలోని మాస్ సీన్స్‌కు డబుల్ ఉంటాయని నిర్మాత చెప్పడంతో అంచనాలు పెరిగిపోయాయి. మరో హిట్ కొట్టాలని వేణుకు ఫ్యాన్స్ విషెస్ చెబుతున్నారు.
Similar News
News February 3, 2026
జనవరిలో రికార్డు స్థాయి వాహన అమ్మకాలు

భారత్‌లోని ప్యాసింజర్ వాహన కంపెనీలకు ఈ ఏడాది జనవరి కలిసొచ్చింది. గత నెలలో అన్ని కంపెనీలు 4.5 లక్షల యూనిట్లను విక్రయించాయి. 2025 జనవరితో పోలిస్తే ఇది 12.6% ఎక్కువ. అమ్మకాల్లో మారుతీ సుజుకీ ఇండియా తొలి స్థానంలో నిలవగా, తర్వాత టాటా మోటార్స్, M&M, హ్యుందాయ్ మోటార్స్, టొయోటా సంస్థలు ఎక్కువ వాహనాలను విక్రయించాయి. GST సంస్కరణలు, SUVలకు డిమాండే ఈ సేల్స్ పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
News February 3, 2026
ఇంట్లో ఎలాంటి విగ్రహాలు ఉంటే శుభప్రదం?

కూర్చున్న భంగిమలో ఉన్న దైవ స్వరూపాలనే ఇంట్లో ప్రతిష్ఠించాలి. వాటిని పూజిస్తే ప్రశాంతత, స్థిరమైన సంపద లభిస్తాయి. కులదైవం, ఇష్టదైవం విగ్రహాలను కూడా ఉంచవచ్చు. శివలింగం బొటనవేలు పరిమాణం కంటే తక్కువ ఉన్నవి ఎంచుకోవాలి. విగ్రహాలు వెండి, రాగి లేదా ఇత్తడి వంటి లోహాలతో చేసినవి లేదా మట్టితో చేసినవి వాడటం వల్ల సాత్విక శక్తి పెరుగుతుంది.
News February 3, 2026
లండన్‌లో మంత్రి నారాయణ పర్యటన

AP: అమరావతి నిర్మాణంలో భాగంగా పలు ప్రాజెక్టుల అధ్యయనం కోసం యూకేలో మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతోంది. అమరావతిలో అమలు చేయగలిగే ఆధునిక పట్టణ ప్రణాళిక, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ వంటి అంశాలపై ఈ బృందం అధ్యయనం చేస్తోంది. లండన్ కార్పొరేషన్ ప్లానింగ్ డైరెక్టర్ గ్విన్ రిచర్డ్స్‌తో మంత్రి సమావేశమయ్యారు. లండన్ మాస్టర్ ప్లాన్, రవాణా, అభివృద్ధి ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నారు.


