News March 16, 2024
తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లోకి వేణుంబాక

ముత్తుకూరు మండలం తాళ్లపూడికి చెందిన వేణుంబాక విజయసాయి రెడ్డి వైసీపీలో కీలక నేత. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడిన తర్వాత అనూహ్య పరిణామాల మధ్య నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన విజయసాయి రెడ్డి అభ్యర్థిత్వాన్ని వైసీపీ అధిష్ఠానం ఫైనల్ చేసింది. ఆయన ప్రత్యర్థిగా వేమిరెడ్డి ఉన్నారు.
Similar News
News February 21, 2026
ఇంటర్ పరీక్షలకు పటిష్ట బందోబస్త్: నెల్లూరు SP

ఇంటర్ పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు SP అజిత తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రం సమీపంలో ఉండే జిరాక్స్ సెంటర్లను మూసివేస్తున్నట్లు వివరించారు. మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ వంటి చర్యలకు విద్యార్థులు ఎవరైనా పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 23 నుంచి మార్చి 24 వరకు పరీక్షలు జరగనున్నాయి.
News February 21, 2026
బుచ్చిలో రూ.కోట్లలో క్రికెట్ బెట్టింగ్..?

బుచ్చి క్రికెట్ బెట్టింగ్‌కు అడ్డాగా మారింది. నిత్యం కోట్లలో బెట్టింగ్ సాగుతుంది. నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు వద్ద పట్టుబడ్డ నగదే ఇందుకు సాక్ష్యం. రాదే ఎక్స్‌ఛేంజ్ యాప్ తరహాలో ఎన్నో యాప్‌ల ద్వారా యువతే లక్ష్యంగా నిత్యం బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. యువత బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకొని ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ఎస్పీ దృష్టి పెడితే ఎందరో బెట్టింగ్ రాయుళ్లు వెలుగులోకి వచ్చే అవకాశం.
News February 21, 2026
సోషల్ మీడియా ద్వారా సమస్యలు చెబుతున్న చిన్నారులు

సోషల్ మీడియాతో విద్యార్థులు పెడదారిన పడుతున్న సమయంలో అదే వేదికగా తమ సమస్యలు పాలకుల దృష్టికి తీసుకు వెళ్తున్న సందర్భాలు జరుగుతున్నాయి. ఇటీవల కొండాపురం (M) గజ్జలవారిపల్లి గ్రామానికి విద్యార్థులు రోడ్డు లేదని సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ స్పందించారు. అదే పందాను అనుసరిస్తూ విద్యార్థులు తమకు రోడ్లు లేవని చేతులెత్తి ముక్కుతూ వీడియో విడుదల చేయడం కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుంది.


