News October 28, 2024
చైతూ-శోభితపై కామెంట్స్ చేసిన వేణుస్వామికి షాక్

నాగచైతన్య – శోభిత విడాకులు తీసుకుంటారని జోస్యం చెప్పిన వేణుస్వామికి TG హైకోర్టు షాక్ ఇచ్చింది. వారంలోగా ఈ కేసులో చర్యలు తీసుకోవచ్చని మహిళా కమిషన్ను న్యాయస్థానం ఆదేశించింది. వేణు స్వామిపై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ చేసిన ఫిర్యాదు మేరకు విచారణకు హాజరుకావాలని గతంలో మహిళా కమిషన్ ఆదేశించింది. ఈక్రమంలో ఆయన కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తాజాగా ఆ స్టేను హైకోర్టు ఎత్తివేసింది.
Similar News
News November 17, 2025
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

నేటి నుంచి ఎల్లుండి ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలో చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపు తెల్లవారుజామున ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో ఉష్ణోగ్రతలు పడిపోతాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లుండి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, నిర్మల్లో చలి తీవ్రత ఉంటుందంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది.

హనుమాన్ చాలీసా భావం – 12

రఘుపతి కీన్హీ బహుత బడాయీ |
తుమ మమ ప్రియ భరత సమ భాయీ ||
హనుమంతుడు చేసిన సాయానికి రాముడు ఆయనను ఎంతో మెచ్చుకున్నారు. ‘నీవు నాకు నా ప్రియమైన తమ్ముడైన భరతునితో సమానమైన ఆప్తుడివి’ అని ప్రకటించారు. ఇది ఆంజనేయుడి సేవ, నిస్వార్థ భక్తికి శ్రీరాముడు ఇచ్చిన గుర్తింపు. నిజమైన సేవకు, భక్తికి దేవుడి అనుగ్రహం, అపారమైన గౌరవం దక్కుతాయనడానికి ఇదే నిదర్శనం. <<-se>>#HANUMANCHALISA<<>>