News December 12, 2025

VER అభివృద్ధిపై ప్రణాళిక (1/2)

image

వైజాగ్ ఎకానమిక్ రీజియన్‌ అభివృద్ధిపై CM చంద్రబాబు అధికారులు, మంత్రులతో శుక్రవారం సమీక్షించారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ఉమ్మడి తూ.గో జిల్లా VERలో ఉంది. ఇక్కడ చేపట్టాల్సిన ప్రాజెక్టులు, ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు, లక్ష్యాలు, పెట్టుబడుల ఆకర్షణపై చర్చించారు. గ్రోత్ డ్రైవర్ల ద్వారా అభివృద్ధి, గ్లోబల్ పోర్ట్, ఐటీ, అగ్రికల్చర్, టూరిజం, హెల్త్ కేర్ హబ్, మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందించాలన్నారు.

Similar News

News December 12, 2025

ఘోరం.. బాలిక చెవి కొరుక్కుతిన్న కుక్క

image

AP: నంద్యాల జిల్లా ఆత్మకూరులో 4 ఏళ్ల చిన్నారిపై వీధికుక్క పాశవికంగా దాడి చేసింది. ఆసియా అనే బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా దాడి చేసి చెవిని కొరుక్కుతింది. చెంపతో పాటు ఇతర శరీర భాగాలపైనా తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
* పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించండి

News December 12, 2025

రాజాపూర్: MLA అహంకారానికి హెచ్చరిక: ఎంపీ

image

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సొంతూరులో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఓటమి పాలుకావడం ఆయన అహంకారానికి ప్రజలు ఓటుద్వారా చేసిన హెచ్చరిక అని ఎంపీ డీకే అరుణ అన్నారు. రంగారెడ్డిగూడెంలో సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన ఆనంద్ రేవతిని ఎంపీ అభినందిస్తూ, శాలువాతో సన్మానించారు. గ్రామాభివృద్ధికి భవిష్యత్తులో మరింత కృషిచేయాలని సూచించారు. తన పూర్తి సహకారం ఉంటుందని డీకే అరుణ హామీ ఇచ్చారు.

News December 12, 2025

ప్రతి గర్భిణీని మొదటి 3 నెలల్లో తప్పక నమోదు చేయాలి: DMHO

image

గర్భిణీ స్త్రీలు మొదటి 3 నెలలలోపే తప్పక నమోదు చేయించుకోవాలని DMHO విజయమ్మ తెలిపారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో జరిగిన శిశు మరణాలపై సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. నమోదు చేసినప్పటి నుండి వారికి అవసరమైన అన్ని వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. హైరిస్క్ గర్భిణీలపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ఏడో నెలలో బర్త్ ప్లాన్ ఇవ్వాలన్నారు. నవజాత శిశువు సంరక్షణపై ముందుగానే అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.