News April 7, 2025

దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ల కేసుపై రేపు తీర్పు

image

TG: ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైదరాబాద్ దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసుపై రేపు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. 2013 FEB 21న జరిగిన పేలుళ్లలో 18 మంది చనిపోగా 130 మంది గాయపడ్డారు. ఎన్ఐఏ 157 మంది సాక్షులను విచారించి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో యాసిన్ భత్కల్ సహా ఐదుగురు నిందితులకు NIA కోర్టు మరణశిక్ష విధించగా వారు హైకోర్టును ఆశ్రయించారు.

Similar News

News April 8, 2025

పవన్ కుమారుడికి గాయాలు.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

image

TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాలు కావడంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు. కాగా మన్యం పర్యటన ముగించుకున్న పవన్ కళ్యాణ్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి సింగపూర్ బయల్దేరనున్నారు. చిరంజీవి, సురేఖ దంపతులు సైతం సింగపూర్ బయల్దేరారు.

News April 8, 2025

పరామర్శకు వచ్చి జేజేలా?.. జగన్‌పై సునీత ఫైర్

image

AP: పరామర్శలకు ఎలా వెళ్లాలో కూడా మాజీ CM జగన్‌కు తెలియదని TDP MLA పరిటాల సునీత ఎద్దేవా చేశారు. జై జగన్ అంటూ పరామర్శకు వెళ్తారా అని ఆమె ప్రశ్నించారు. ‘పరిటాల కుటుంబాన్ని రెచ్చగొట్టేలా జగన్ మాట్లాడుతున్నారు. పోలీసులపై ఇష్టానుసారంగా మాట్లాడటం ఏంటి? జగన్ ఒక MLA మాత్రమే. ఒక DSP, 10 మంది పోలీసులు ఆయన పర్యటనకు సరిపోతారు. వైసీపీ నేత లింగమయ్య హత్యతో మాకు ఎలాంటి సంబంధం లేదు’ అని ఆమె స్పష్టం చేశారు.

News April 8, 2025

ఇక 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేష‌న్: మంత్రి

image

TG: ప్రజలకు వేగవంతంగా సేవలను అందించేందుకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ఆధునికీకరిస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. 10-15minలో రిజిస్ట్రేష‌న్ పూర్త‌య్యేలా స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. తొలి ద‌శ‌లో ప్ర‌యోగాత్మ‌కంగా 22 కార్యాలయాల్లో ఈనెల 10 నుంచి స్లాట్ బుకింగ్‌ అమ‌లులోకి వస్తుందని పేర్కొన్నారు. registration.telangana.gov.in సైట్‌లో స్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు.

error: Content is protected !!