News April 8, 2024

కాసేపట్లో తీర్పు

image

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై కాసేపట్లో తీర్పు రానుంది. ఉ.10.30 తర్వాత ఢిల్లీ రౌస్ అవెన్యూ సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. మార్చి 26 నుంచి కవిత తిహార్ జైలులో ఉన్నారు. చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోర్టును కోరారు. దీనిపై విచారించిన కోర్టు.. ఏప్రిల్ 4న తీర్పును రిజర్వ్ చేసింది. బెయిల్ ఇవ్వొద్దని ఈడీ వాదిస్తోంది.

Similar News

News January 12, 2026

VZM: చనిపోయినా శ్మశానానికి చేరలేక అవస్థలు..!

image

VZMలోని ముకుందపురం గ్రామంలో శ్మశానానికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం గ్రామంలో ఓ వ్యక్తి మృతి చెందడంతో అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని పంట పొలాల్లో నుంచి అతి కష్టంగా తీసుకువెళ్లాల్సి వచ్చిందని వాపోతున్నారు. రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. మీ ఊళ్లో ఇలాంటి సమస్య ఉందా ? కామెంట్.

News January 12, 2026

టీచర్లకు ‘పరీక్ష’!

image

AP: టెట్‌లో <<18811070>>ఫెయిలైన<<>> ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. పిల్లలకు పాఠాలు బోధిస్తూ ప్రిపేర్ అవ్వడం కుదరలేదని వాపోతున్నారు. 150మార్కుల్లో సంబంధిత సబ్జెక్టు నుంచి 60, మిగతావాటి నుంచి 90 మార్కులకు ప్రశ్నలిచ్చారు. దీంతో లాంగ్వేజ్, సోషల్ టీచర్లకు ఇది సులభమే అయినా సైన్స్, మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్ టీచర్లకు ఇబ్బందిగా మారింది. అయితే టీచర్లకు టెట్ మినహాయింపుపై కేంద్రం <<18828506>>పునరాలోచన<<>> వార్తలు ఉపశమనం కలిగిస్తున్నాయి.

News January 12, 2026

APPLY NOW: హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

వైజాగ్‌లోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌ (<>HSL<<>>)లో 11 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, డిగ్రీ/పీజీ , LLB/LLM, ICAI/ICWAI, MBA, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.300, SC, ST, PwBDలకు ఫీజు లేదు. గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hslvizag.in