News July 10, 2024
రేపటి నుంచి వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్

TG: గ్రూప్-4లో మెరిట్ జాబితాలో చోటు దక్కించుకున్న వినికిడి లోపం ఉన్న అభ్యర్థులకు రేపటి నుంచి సెప్టెంబర్ 4 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. అభ్యర్థులు HYD కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో మెడికల్ బోర్డు ఎదుట హాజరై వెరిఫికేషన్ చేయించుకోవాలని TGPSC తెలిపింది. వెరిఫికేషన్ కోసం వెంట తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు తదితర వివరాల కోసం <
Similar News
News December 11, 2025
చేపల చెరువుల్లో నీటి నాణ్యత కోసం సూచనలు

చేపల చెరువుల్లో పాడిల్ వీల్ ఎరేటర్లు వాడటం ద్వారా చెరువుల్లో ప్రాణ వాయువును పెంచుకోవచ్చు. పరిమితికి మించి చెరువులో చేప పిల్లలను వదలకూడదు. అలాగే చేపల సంఖ్యను బట్టి ఆహారం వేయాలి. ఎక్కువగా వేస్తే చేపలు తినగా మిగిలిన ఆహారం కుళ్లిపోయి చెరువులో ప్రాణ వాయువు పరిమాణాన్ని తగ్గిస్తుంది, అమ్మోనియా మోతాదును పెంచుతుంది. అలాగే చెరువులో పెరిగే కలుపు మొక్కలను నివారిస్తే నీటి నాణ్యత మెరుగుపడుతుంది.
News December 11, 2025
ముగిసిన పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంటలోపు లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. మ.2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా, సా.5గంటలలోపు ఫలితాలు వచ్చే అవకాశముంది. తొలి విడతలో 3,834 సర్పంచ్ స్థానాల్లో 12,960 మంది, 27,628 వార్డుల్లో 65,455 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గ్రామాల అధిపతులెవరో మరికొన్ని గంటల్లో తేలనుంది.
-కౌంటింగ్ లైవ్ అప్డేట్స్ వే2న్యూస్‌లో
News December 11, 2025
1950+ విమానాలను నడుపుతున్నాం: ఇండిగో

ఇవాళ 1,950కి పైగా విమానాలను నడుపుతున్నట్లు ఇండిగో ప్రకటించింది. 138 గమ్యస్థానాలకు దాదాపు 3 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారని తెలిపింది. నెట్‌వర్క్ పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొంది. డిసెంబర్ 8 నుంచి ఇండిగోలో నెట్‌వర్క్ సమస్యలు తలెత్తి వందలాది ఫ్లైట్‌లు రద్దయిన విషయం తెలిసిందే.


